భారతదేశంలో మే 3 వరకు పొడిగించిన లాక్ డౌన్ మరొక వారం రోజుల్లో ముగియనుంది. ఇటు వైపు చూస్తే కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న వైరస్ మహమ్మారి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆర్థిక పరిస్థితిని విపరీతంగా దెబ్బతీసింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రోజుకి 150 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది అంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు.

 

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా జరగాల్సిన అత్యవసర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కేసులు లేని జిల్లాలలో లాక్ డౌన్ ను సడలించాలని భావిస్తోంది. ఇప్పుడే దేశంలో అన్నీ రాష్ట్రాల కంటే ఎక్కువగా కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులను నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే డెంజర్ జోన్స్ మరియు సేఫ్ జోన్ల పైన ఒక అంచనాకు వచ్చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రాంతాన్ని విభజించి వాటికి తగ్గట్టుగా సడలింపులు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదీ కాకుండా ఏపీ లో అత్యధిక భాగం కేసులు కర్నూలు, గుంటూరు, కృష్ణా మరియు చిత్తూరు జిల్లాలలోనే అత్యధికంగా నమోదవుతున్నాయి.

 

రాష్ట్రం లో రెడ్, ఆరంజ్, గ్రీన్ జోన్ లను ఏర్పాటును చేసిన విషయం అందరికీ తెలిసినదే. ఆయా జోన్లు బట్టి సడలింపులు ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా రెడ్ జోన్లపై మరిన్ని ఆంక్షలు పెట్టి ఎవరు ప్రాంతాలలో తిరగకుండా భావిస్తున్నారు. ఆయా జోన్లలో ప్రజలకు ప్రత్యేకమైన పాసులు ఇవ్వాలని అనుకుంటున్నారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి మాత్రమే ఆపాస్ చూపించి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్సల కోసం ప్రత్యేకమైన హాస్పిటల్స్ ను ఎంచుకొనున్నారు. అంటే కొన్ని హాస్పిటల్స్ ను ప్రత్యేకంగా కరోనా పేషెంట్లు కోసమే పనిచేయనున్నారు

 

అయితే లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో జగన్ పార్టీలో కొనసాగించి గ్రామాల్లో ఎత్తివేయాలని ముఖ్యంగా వ్యవసాయ రంగానికి ఎలాంటి సమస్య రాకుండా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం

 

మరింత సమాచారం తెలుసుకోండి: