ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాంతాన్ని మానవులు ఆక్రమించారను కుంటారు.. కానీ మనుషులకు తెలియని, సైంటిస్ట్‌లకు అంతు చిక్కని ఎన్నో రహస్యమైన ప్రదేశాలు ఈ ధరణిలో రహస్యంగా దాగున్నాయి.. ఇలాంటివి కనుగొనాలంటే చాల శ్రమతో కూడుకున్న పని.. అయినా కానీ కొందరు శాస్త్రవేత్తలు తమ ప్రాణాలకు తెగించి ఈ సృష్టిలో ఉన్న రహస్యాలను వెలికితీసే ప్రయత్నాలు చేస్తున్నారు.. దీని వల్ల ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయి.. అందరు ప్రాణాలకు భయపడి ఉన్నచోటనే కూర్చుండి పోతే ఈ రోజు అనుభవిస్తున్న ఇన్ని సుఖాలు మానవులకు దక్కేవి కావు.. ఇంతగా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేది కాదు..

 

 

ఎందరో మహానుభావుల విశేషమైన కృషి ఫలితమే ఈనాడు అనుభవిస్తున్న సౌకర్యాలు.. ఇకపోతే తాజాగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని సైంటిస్ట్ లు గుర్తించారు... ఇప్పటివరకు భూమి పై పొడవైన చెట్లు, లోతైన సముద్రాల గురించి మాత్రమే మానవులకు తెలుసు.. కానీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఇక విషయానికొస్తే  పార్ట్స్ మౌత్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 100 మిలియన్ సంవత్సరాల క్రితం.. నాటి డైనోసార్ల పై ఆఫ్రికాలో పరిశోధనలు చేసిన తరువాత.. ఎగిరే సరీసృపాలు, మొసలి లాంటి భయంకరమైన జంతువుల జాడల్ని కనుగొన్నారు..

 

 

ఇలా అప్పుడప్పుడు తమ పరిశోధనల ద్వారా మానవాళికి ఏదో ఒక కొత్త విషయాన్ని సైంటిస్టులు తెలియచేస్తున్నారు.. ఇలాంటి కోవలోకే చెందినదే ఇప్పుడు కనుగొన్న భయంకరమైన ప్రాంతం..  ఇంగ్లాండ్‌ పాలియోంటాలజిస్టులు గుర్తించినట్లుగా చెబుతున్నా ఈ ప్రాంతం ఆగ్నేయ మొరాకోలోని క్రెటేషియస్ శిలల నిర్మాణ ప్రాంతంగా పేర్కొంటున్నారు... కాగా భూమిపై అత్యంత ప్రమాదకరమైన ప్రదేశంగా ఈ ప్రాంతం ప్రకటించబడిందట. ఎందుకంటే దీని చుట్టూ వివిధ రకాల జల మరియు భూ సంబంధమైన జంతువులు, విస్తృతమైన నదులు, ఉన్నాయంటున్నారు..

 

 

ఈ విషయన్ని డెట్రాయిట్ మెర్సీ విశ్వవిద్యాలయం, బయాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్, సైంటిస్ట్  డాక్టర్ నిజార్ఇబ్రహీం తెలిపారు. అదీగాక ఈ ప్రదేశంలో అతిపెద్ద డైనోసార్ల జాడలను గుర్తించినట్లు, మొసలితో పాటు ఎగిరే సరీసృపాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రాంతం భూ గ్రహంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా.. మానవుడు నివసించలేని ప్రమాదకరమైన ప్రదేశంగా సైంటిస్ట్ నిజార్ వెల్లడించారు... 

మరింత సమాచారం తెలుసుకోండి: