వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొచ్చేది మామిడికాయలు. నోరూరించే మామిడి పళ్ల రసాలు చూస్తుంటే ఎవరైనా ఆగుతారా.. కాని ప్రస్తుతం మామిడి పళ్ళు కొనాలా వద్దా అనే అయోమయం లోనే ఉన్నారు చాలా మంది. మామూలుగానే వేసవి వస్తే మామిడిపల్లి గిరాకీ పెరుగుతుంది కానీ ఇప్పుడు వేసవి మొదలైనప్పటికీ మామిడిపల్లకి ఎలాంటి గిరాకీ  పెరగలేదు. కారణం కరోనా వైరస్ . కరోనా  వైరస్ కారణంగా ఇప్పుడు మామిడి పళ్ళ  జోలికి వస్తే ఎక్కడ కరోనా  వస్తుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఎందుకంటే మామిడిపళ్ళ దుకాణం అన్న  తర్వాత చాలా మంది అక్కడికి వచ్చి మామిడి పళ్ళు  ఎలా ఉన్నాయి అని చూసి పోతూ ఉంటారు. అందుకే ప్రజలు ఎవరూ మామిడికాయలు జోలికి కూడా వెళ్లడం లేదు. 

 

 

 

 ఈ వేసవిలో మామిడి ప్రియులకు  ఇక నిరాశే ఎదురైంది అని చెప్పాలి. ఎందుకంటే చాలా మటుకు మార్కెట్లో కూడా సరిగా మామిడి పళ్ళు కనిపించడం లేదు. ప్రజలు కూడా రోడ్ల మీదికి రావడం లేదు. తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాజిక భౌతిక దూరం పాటిస్తూ సేకరించిన మామిడి పళ్ళను  సహజ పద్ధతిలో 5 కిలోల చొప్పున ప్యాక్ చేసి ప్రజల ఇంటివద్దకే డెలివరీ చేయాలని తెలంగాణ ఉద్యానవన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మామిడి ప్రియులకు ఓ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఇలా డోర్ డెలివరీ చేసేందుకు తపాలశాక పార్సెల్ సర్వీస్ సేవలను వినియోగించుకుంటున్నట్లు  తెలిపిన తెలంగాణ ఉద్యానవనశాఖ 5 కిలోల బాక్స్ కు డెలివరీ చార్జీలు కలిపి మొత్తం 350 రూపాయలు చెల్లించాలని వెల్లడించారు అధికారులు

 

 

 

 ఇక ఒక్కో బాక్స్ లో 12 నుంచి 15 బంగినపల్లి మామిడిపండు ఉంటాయని అధికారులు వెల్లడించారు. దీని కోసం 2 మొబైల్ నెంబర్లను కూడా ఇచ్చారు. ఈ మొబైల్ నెంబర్లకు ఫోన్ చేసి మీకు కావాల్సిన ఆర్డర్ ఇవ్వాలని సూచించారు తెలంగాణ ఉద్యానవనశాఖ అధికారులు. ఆ నెంబర్లు ఏమిటి అంటే 7997724925, 7997724944 నెంబర్లకు కాల్ చేయాలని సూచించారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాలుగైదు రోజుల్లో డెలివరీ అవుతుందని తెలిపారు అధికారులు. మే 1వ తేదీ నుంచి ఈ బుకింగ్ స్వీకరిస్తామని పేర్కొన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: