యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. లక్షల సంఖ్యలో ప్రాణాలు బలిగొంది.  ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేస్తుంది. ఎంత మంది ప్రాణాలు బలి కానున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా 30వేల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  దేశంలో ఎక్కువ గా కరోనా ప్రభావం మహరాష్ట్రలో ఉంది.  కాగా, దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

 

ఎందుకంటే ఇండోర్ లో వెలుగుచూసిన కరోనా వైరస్ జాతి భయపెడుతోంది.  ఇతర రాష్ట్రాల ప్రాంతాలతో పోలిస్తే.. ఇండోర్ లో ఎక్కువగా వైరస్ విజృంభిస్తుంది.  ఇండోర్ లో బయటపడ్డ వైరస్ మరింత తీవ్రత కలిగి ఉందని పరిశోధనల్లో తేలింది. మధ్యప్రదేశ్ లోని కరోనా హాట్ స్పాట్ కేంద్రాల్లో ఇండోర్ ఒకటి. ఇండోర్ లో కరోనాతో 57మంది చనిపోయారు. ఇండోర్ నుంచి సేకరించిన కరోనా వైరస్ పై పరిశోధనలు చేసేందుకు శాంపుల్స్ ను నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి(NIV) పంపారు. కరోనా రోగుల నుంచి శాంపుల్స్ సేకరించేందుకు ఇండోర్ లో ఓ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా వైరస్ కేసులు ముప్పై వేలకు చేరువయ్యాయి.

 

గడిచిన 24గంటల్లో 62 మరణాలు, 1,543 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇండియాలో కరోనా కేసులు 2,9435కు పెరిగాయి. ప్రస్తుతం 2,1632 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వైరస్ మహమ్మారి నుంచి 6,868 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ తో 934 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: