జగన్మోహన్ రెడ్డి  అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు కు కేరాఫ్ అడ్రస్ గా పాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పేద ప్రజల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. పేద విద్యార్థులందరూ చదువుకునేందుకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మెరుగైన విద్య కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే  ఈ రోజు జగనన్న వసతి దీవెన  అని సంచలన పథకానికి పురుడు  పోశారు  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. 

 

 ఈ పథకం కింద తైమాసికం పూర్తవ్వగానే  విద్యార్ధి తల్లి  ఖాతా లోకి 20000 ఇవ్వనుంది జగన్ సర్కార్.  విద్యార్థుల తల్లుల ఖాతాలో ఫీజు నగదు జమ నేరుగా  అవుతుంది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన జగనన్న విద్యా దీవెన పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే కేవలం ఈ ఒక్క పథకమే కాదు పేద విద్యార్థులు చదువుకునేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 అమ్మ ఒడి పథకం ద్వారా 15 వేల రూపాయలను అందిస్తున్న జగన్ సర్కార్... జగనన్న విద్యాదీవెన ద్వారా 20 వేల రూపాయలను అందజేస్తున్నారు. పేద విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా అందిస్తుంది జగన్ సర్కార్. ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థుల తలరాతలను మారుస్తున్నారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్ స్కూళ్లకు మించిన విద్య పేద విద్యార్థులకు అందేలా ముందుకు సాగుతున్నారు. ఇక పేద విద్యార్థులందరూ మాకు ఏ సమస్య వచ్చినా జగన్ అన్న ఉన్నాడు అనే ధీమాతో  చదువుకోగలుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: