దేశంలో పెరిగిపోతున్న కరోనాకి చిన్నా పెద్ద.. రాజూ పేద అనే తేడా లేకుండా ఎవ్వరినీ వదలడం లేదు.  ఇటీవల కరోనా చిన్నారులకు సోకింది.. అయితే దేశంలో చనిపోయిన వారు దాదాపు వృద్దులే అంటున్నారు. కరోనా లో యావత్ భారత దేశం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దాంతో ఎంతో మంది నిరుపేదలు కష్టాల్లో ఉన్నారు. వారిని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పేద ప్రజలను ఆదుకునేందుకు తమ వంతు కృషి చేస్తుంది.  అయితే అలాంటి వారిని ఆదుకునేందుకు పీఎం, సీఎం నిధులకు విరాళాలు ఇస్తున్నారు.  

 

ఈ విరాళలాలు సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాల వారు ఇస్తున్నారు. కొన్ని చోట్లు సామాన్యులు సైతం తమ వంతు సహాయంగా నిధులు అందిస్తున్నారు.  ఈ రోజు హైదరాబాద్ కు చెందిన అలివేలు తన పెద్ద మనసును చాటుకుంది. జియగుడాకు చెందిన అలివేలు,  గత ఐదు సంవత్సరాలుగా జిహెచ్ఎంసిలో పారిశుద్ధ్య విభాగంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె ఈరోజు రూ. 12000 తన నెల జీతం లోంచి పదివేల రూపాయలు తీసి మంత్రి కే. తారకరామారావు ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది.

 

ఈ సందర్భంగా అలివేలు మంచి మనసు ని అభినందించిన మంత్రి కేటీఆర్ ఆమెతో కాసేపు మాట్లాడారు.  ఆమెది చిన్న జీతమే అయినా ఆమె మనసు ఎంతో గొప్పదని.. ఇంత తక్కువ కుటుంబ ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఒక నెల జీతాన్ని కరొనా పోరు కోసం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన అలివేలు ని మంత్రి అభినందించారు. ఆమె పిల్లలు భర్త ఏం చేస్తారంటుటూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మీకు ఏ అవసరం ఉన్నా చెప్పమమ్మా అన్నారు.. దానికి లేదు సార్.. లాభాపేక్ష కానీ ప్రయోజనం కానీ ఆశించి ఈ విరాళం ఇవ్వడం లేదని కేవలం ఇతరులకు ఈ కష్టకాలంలో ఉపయోగపడాలన్న ఆలోచనతోనే ఇస్తున్నానని మంత్రికి సమాధానం ఇచ్చింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: