దేశంలో ఒక వైపు కరోనా వైరస్ విజృంభణ మరోవైపు ఆకలి కేకలు ఇలాంటి సందర్భంలో  వలస కూలీలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లాక్ డౌన్ వల్ల మధ్య తరగతి మరియు పేద ప్రజలు తీవ్ర స్థాయిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో వలస కూలీలు పని లేక సొంత ఇంటికి వెళ్ళలేక నరక యాతన పడుతున్నారు. ఎక్కడికక్కడ రవాణా నిలిచిపోవడంతో పనులు లేకపోవడంతో సొంత ఇంటికి వెళ్ళటానికి పాదయాత్ర చేస్తూ చాలా మంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. పేద మరియు వలస కూలీల ను ప్రస్తుతం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోతే… కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఆకలితో చనిపోయే వాళ్ళ మరణాల సంఖ్య దేశం లో క్కువగా ఉంటుందని అంటున్నారు.

 

ఎక్కడో ఇతర దేశాల్లో డబ్బు ఉన్న పిల్లల కోసం వేల వేల కోట్లు విమానాల ఖర్చుపెట్టి తీసుకొచ్చిన ప్రభుత్వం పేద వాడిని వలస కూలీ లను  పట్టించుకోవాలని దేశవ్యాప్తంగా చాలామంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా కనీసం ఓ 3 రోజుల పాటు వీళ్ల కోసం రైళ్లు నడిపితే బాగుంటుందని సూచిస్తున్నారు.

 

ప్రస్తుతం దేశంలో ఉన్న లెక్కల్ని బట్టి చూస్తే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు కంటే వలస కూలీలు చాలామంది వేల సంఖ్యలో ఉన్నారని, వాళ్లని ఆదుకో పోతే తీవ్ర పరిణామాలు చోటుచేసుకోవడం గ్యారెంటీ అని మేధావులు అంటున్నారు. వలస కూలీల ను ఉచితంగా ప్రభుత్వాలు సొంత ప్రాంతాలకు తరలించాలని చాలామంది అంటున్నారు. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: