అదేంటి చంద్రబాబు పడక్కుర్చీలో కూర్చున్నారా. ఆయన వయసు డెబ్బయి కానీ, మనసు ఇరవై, ఆయన మళ్ళీ 2024 నాటికి ఏపీలో ముఖ్యమంత్రి అవుతారు. ఆయన తరువాత కొడుకు లోకేష్ కూడా ముఖ్యమంత్రి అవుతాడు. బాబుకు దశ బాగుంటే ఈ దేశానికి ప్రధాని అవుతారు. 

ఇది కదా తమ్ముళ్ళు ఆలోచిస్తుంది. ఇదే కదా తమ్ముళ్ళు కలలు కంటున్నది, మరిదేంటి బాబు పడక్కుర్చీకి పరిమితం కావడమేంటి. అంటే అక్కడే ఉంది తమాషా. ఆ తమాషా పేరే కరోనా. కరోనా బాబుకు గత నలభై రోజులుగా ఇంటిపట్టున కట్టిపడేసింది. బాబుని బయటకు కదలనీయడంలేదు. బాబు మొత్తం రాజకీయ జీవితంలో ఈ సీజన్ నిజంగా గుర్తుపెట్టుకోవాల్సిందే.

 

అంతేనా బాబు ఇంట్లో ఉన్నా రాజకీయం మానడంలేదు. కానీ జనం మాత్రం లేరు. దాంతో ఆయనకు తోచడం లేదు. అందుకే జనంతో తాను, తనతో జనం ఉన్న పాత ఫోటోలు పెట్టుకుని ముచ్చట పడుతున్నారు. ఏడేళ్ళ క్రితం బాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర ముగింపు 2013 ఏప్రిల్ 28బ  విశాఖలో జరిగింది. దాంతో ఆనాటి ముచ్చట్లను ఫోటోలను ట్విట్టర్ లో పెట్టి మరీ బాబు తన గత వైభవాన్ని గట్టిగా తలచుకుంటున్నారు.

 

ఆనాడు పాదయాత్ర  చేయడం దానికి వచ్చిన రెస్పాన్స్ తో పడకేసిన పార్టీని ముందుకు కదిల్చి ఏపీకి తొలి ముఖ్యమంత్రి కావడం ఇవన్నీ బాబులో నిజంగా ఆశలు రేపేవే. అప్పటి మాదిరిగా ఇపుడు కూడా ఏదో అద్భుతం జరుగుతుందని తాను మళ్ళీ సీఎం అవడం ఖాయమని బాబు భావిస్తున్నారు. అందుక ఆయన గత కాలం వైభవాన్ని గుర్తుకు తెచ్చుకుని మరీ తన ఆశలకు కొత రంగులు పూస్తున్నారు.

 

అయితే పడక్కుర్చీతో కూర్చుని పాత సంగతులు నెమరువేసుకోవడం మొదలైంది అంటే అదిక రిటైర్మెంట్ ఏజ్ గానే భావించాలని, మొత్తానికి గత ఏడాది జగన్ వచ్చి బాబుని విపక్షంలో కూర్చోబెడితే ఈ ఏడాది కరోనా వచ్చి బాబుని ఏకంగా పడక్కుర్చీలోనే కూర్చోబెట్టేసిందని వైసీపీ నుంచి సెటైర్లు వస్తున్నాయి. ఏది ఏమైనా రేపు నుంచి నిన్నటికి ఆలోచనలు జారుతున్నాయంటే కొంచెం ఆలోచించాల్సిన విషయమేనని మానసిక శాస్రవేత్తలు అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: