కరోనా ఎవరినీ వదలడం లేదు. ఒక్కరికి కరోనా సోకిందని తెలిస్తే చాలు.. ప్రైమరీ, కాంటాక్ట్‌లను తీసుకెళ్లి క్వారంటైన్‌లో పెడుతున్నారు అధికారులు. దీంతో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇన్నాళ్లూ గుట్టుగా సాగుతున్న అక్రమసంబంధాలు సైతం వెలుగు చూస్తున్నాయి. చాలా మంది ప్రబుద్ధుల బండారాలు బయటపడుతున్నాయి.

 

కరోనా కట్టడికి అధికారులు తీసుకుంటున్న చర్యలు.. కొంత మందికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కరోనా పాజిటివ్ అని తెలియగానే.. పేషంట్‌తో పాటు ప్రైమరీతో పాటు సెకండరీ కాంటాక్ట్ లను కూడా అధికారులు బయటకు తీస్తున్నారు. దీంతో కరొనా లక్షణాలు వున్న వ్యక్తి.. ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే విషయం కూడా వెలుగులోకి వస్తోంది. 

 

కరొనా సోకిందని నిర్ధారణ అయితేచాలు... ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని రకాల డేటాను బయటకు తీస్తున్నారు పోలీసులు. దీంతో తప్పడు పనులు చేసే వారికి ఇబ్బందులు తప్పడంలేదు. అదెలాగంటే.. ఇటీవల భూపాల్‌కు చెందిన ఒక అమ్మాయికి కరొనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ అమ్మాయికి బాయ్ ప్రెండ్ ఉన్న విషయం ఇంట్లో వాళ్లకు తెలియదు. పోలీసులు అమ్మాయి కాంటాక్ట్ లిస్టు బయటకు తీయడంతో.. బాయ్ ప్రెండ్ విషయం బయట పడింది. బాయ్ ప్రెండ్‌ని తీసుకొచ్చి టెస్టులు చేయగా.. కరొనా పాజిటివ్‌గా తేలింది.

 

ఈ చైన్‌ ఇంతటితో ఆగలేదు.. ఈ బాయ్‌ ఫ్రెండ్‌ కాంటాక్ట్‌ లిస్టు చెక్‌చేస్తే అతను మరో అమ్మాయితో లవ్‌ ఎఫెయిర్‌ నడుపుతున్నట్టు తెలిసింది. ఆమెను తీసుకొచ్చి చెక్‌ చేస్తే ఆమెకు కూడా పాజిటివ్‌ వచ్చింది. అయితే ఉహించని రీతిలో మొదటి అమ్మాయి ద్వారా మరో అబ్బాయికి కూడా కరోనా సోకింది. దీంతో ఆమె ఇద్దరు అబ్బాయిలతో లవ్ ఎఫైర్‌ నడుపుతోందనే విషయం బయటపడింది. 

 

ఇక మరొక విచిత్రమైన కేసు కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజూ ఆఫీస్‌కు వెళ్తున్న వ్యక్తికి కరోనా సోకింది. అలాగని కొలీగ్స్‌తో పాటు.. ఇంటి చుట్టు ప్రక్కల వాళ్లెవ్వరికీ కరొనా లేదు. దీనిపై ఆరా తీయగా.. ఈ వ్యక్తి ఆఫీస్‌ ముగిసిన వెంటనే సెకండ్‌ సెటప్‌ దగ్గరికి వెళ్తున్నట్టు తెలిసింది. ఆమెకు టెస్టులు నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలడంతో.. ఇద్దరినీ క్వారంటైన్‌కు తరలించారు. 

 

కరోనా కట్టడికోసం అధికారులు తీస్తున్న కాంటాక్ట్‌ లిస్టుతో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. చాలామంది యువకులకు అమ్మాయిలతో ఉన్న కాంటాక్టులు బట్టబయలవుతున్నాయి. ఇంట్లో బుద్ధిమంతుల్లా బిల్డప్పులిచ్చేవారికి సైతం అమ్మాయిలతో ఎపెర్స్ వున్న విషయాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా సాగిన యవ్వారలన్నీ.. ఇప్పుడు కరోనా దెబ్బకు ఒక్కొక్కటిగా బయటకొస్తుండటంతో.. ఆ బాపతు మనుషులకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: