ప్రభుత్వ నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శ చేస్తున్నారు. గత వారం రోజుల నుండి కరోనా వైరస్ కేసులు రాష్ట్రంలో రెట్టింపయ్యాయి అని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. వలస కూలీలు కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని పేర్కొన్నారు. ఇక రైతు పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిన అనేక విపత్తులను బాధ్యతాయుతంగా ఎదుర్కొన్నామని తాజాగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తూ లెటర్ రిలీజ్ చేశారు.

 

కరోనా వైరస్ ఎంపీలకు మరియు రాజ్ భవన్ లో ఉన్న సిబ్బందికి కూడా వైరస్ సోకింది అని అంత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ విధంగా జరుగుతుందని విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగానే ఉంటే ప్రజలు కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందని భయపెట్టే విధంగా లెటర్ రాయటంతో చంద్రబాబుపై మండి పడుతున్నారు ఏపీ అధికార పార్టీ నేతలు. ఎక్కడో వేరే ఇతర రాష్ట్రంలో ఉంటూ ప్రభుత్వంపై విమర్శలు చేయటం దారుణం అని అంటున్నారు. ఎక్కడికక్కడ కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తూ ఇతరులకు సోకకుండా ప్రభుత్వం తెలివిగా వ్యవహరిస్తోందని అధికార పార్టీ నేతలు అంటున్నారు.

 

దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పరీక్షలు జరుగుతున్నాయని…. ఇలా జరగటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని త్వరగా కరోనా పాజిటివ్ కేసులు గుర్తించవచ్చని వైద్యులు కూడా అంటున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది అని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి భయపెట్టే టట్టు వ్యవహరించటం సిగ్గుచేటని వైసిపి నాయకులు చంద్రబాబు లెటర్ పై మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: