కరోనా ప్రభావం మొదలైన దగ్గర నుంచి ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. వైసీపీ, టీడీపీ నేతలు ప్రతిరోజూ దీనిపై పెద్ద రచ్చే చేస్తున్నారు. కొందరు అయితే కాస్త హద్దు దాటేసి వ్యక్తిగత దూషణలకు కూడా దిగుతున్నారు. అయితే ఆ దూషణలు కూడా ఇప్పుడు కామన్ అయిపోయాయి.

 

కానీ టీడీపీ చేసే విమర్శలకు చెక్ పెట్టడంలో భాగంగా వైసీపీ నేతలు కాస్త ఘాటుగానే స్పందిస్తున్నా, మంత్రి మోపిదేవి వెంకటరమణ చేసిన ఆరోపణలు ఎవరు చేయలేదు. ఒక్క మోపిదేవి మాత్రమే ఊహించని విధంగా టీడీపీ కార్యకర్తలు స్లీపర్‌ సెల్స్‌లా పని చేస్తూ.. గ్రామాల్లో వైర్‌సను ప్రవేశపెట్టడం వల్లే కొత్తగా పాజిటివ్‌ కేసులు వస్తున్నాయనే అనుమానం ఉందంటూ మాట్లాడారు. ఈ కుట్రకు చంద్రబాబు తెరలేపారేమోనని.. సీఎం జగన్‌ను, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ఆయన ఏ స్థాయికైనా దిగజారతారని అన్నారు.

 

ఇక ఇలా మోపిదేవి ఒక్కరే మాత్రమే మాట్లాడారు. వేరే వైసీపీ నేతలు గానీ, మంత్రులు గానీ ఇలాంటి వ్యాఖ్యలు అసలు చేయలేదు. దీంతో టీడీపీ నేతలు మోపిదేవిని టార్గెట్ పెట్టుకుని, ఆయనపై రివర్స్ కౌంటర్లు వేస్తూ, ప్రజల ముందు ఆయన్ని ఎలాగైనా బుక్ చేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ను నియంత్రించలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, మీ ప్రభుత్వం చేతగాని తనాన్ని టీడీపీపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని,

 

అయినా టీడీపీ వల్ల ఎన్ని కేసులు వచ్చాయో లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ వల్ల కరోనా వస్తే మీ ఇంటిలిజెన్స్ నిద్రపోతుందా? అసలు ఇంటిలిజెన్స్ ద్వారా ఏం తెలుసుకున్నారు? అంటూ  ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే మోపిదేవి మాటలపై తటస్థంగా ఉండే ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కరోనాపై దృష్టి పెట్టకుండా, ఇలా స్లీపర్ సెల్స్ అంటూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల ప్రభుత్వం ప్రజల్లో చులకనయ్యే అవకాశముందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: