కరోనా వైరస్ ప్రపంచంలో బాగా విస్తరిస్తున్న సమయంలో ఎక్కువగా మరణాలు సంభవించిన దేశంగా ఇటలీ వార్తల్లో నిలిచింది. ఈ వైరస్ వల్ల చైనాలో మరణాలు ఎక్కువగా సంభవించిన తర్వాత ఇటలీలో భయంకరంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు మరణాలు కూడా అదే రీతిలో సంభవించాయి. ఇటలీ దేశంలో ఎక్కువగా వైరస్ విస్తరించడానికి గల కారణాలు చూస్తే అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన ఆ ప్రజలు పట్టించుకోకపోవడంతో ఎక్కువ మరణాలు సంభవించాయి. ముఖ్యంగా ఆ ప్రాంతంలో వైరస్ అంతగా బలపడటానికి కారణం చూస్తే ‘సార్స్-కోవిడ్2’ అనే స్టెరాయిన్ జాతి వైరస్ అని  శాస్త్రవేత్తలు తేల్చారు.

 

పరిస్థితి ఇలా ఉండగా ఇండియాలో వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో శాస్త్రవేత్తలు రంగంలోకి దిగి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇటీవల ఎక్కువగా నమోదు అవటానికి గల కారణాలను తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో మరియు గుజరాత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటపడటంతో శాస్త్రవేత్తలు అక్కడ పరిశోధనలు జరపగా… కరోనా వైరస్ వచ్చిన కేసుల్లో ఇటలీలో అంత మంది మరణాలకు కారణమైన ‘ఎల్ టైప్ స్టెరాయిన్’ రెండు రాష్ట్రాలలో ఉందని గుర్తించారు.

 

అయితే ఇది వేసవి కాలం కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాల్లో పగడ్బందీగా లాక్ డౌన్ అమలు చేసి దాని ప్రభావం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఇటువంటి ప్రమాదకరమైన వైరస్ వర్షా కాలం వరకు కొనసాగితే, ఇండియా లో వచ్చే వర్షాకాలం నుండి మరణాలు అధికంగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple.

మరింత సమాచారం తెలుసుకోండి: