దేశంలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కఠిన నిబంధనలు అమలు చేస్తూ ప్రజలను ఇంటికే పరిమితం అయ్యేలా చేస్తుంది. అయితే ఈ సమయంలో ఏ రాష్ట్రంలో కూడా మద్యం దుకాణాల తెచ్చుకోవడం లేదు అన్న విషయం తెలిసిందే. దాదాపు గత నెల రోజుల నుండి మద్యం దుకాణాలు ఎక్కడా తెరిచిన దాఖలాలు లేవు. కానీ మహారాష్ట్రలో మాత్రం అక్కడి ప్రభుత్వం ప్రతిపాదించిన మద్యం పాలసీ విమర్శలకు దారి తీస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా కరోనా  వైరస్ ప్రభావం  ఉన్న రాష్ట్రలలో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. ఇక్కడ దేశంలోని ఏ రాష్ట్రంలో లేని పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

 


 అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం ఏదో చెబితే ఇంకేదో అయినట్లు ఉంది పరిస్థితి.మద్యం  విలాసాలకు వ్యతిరేకి అయినటువంటి థాకరే  కుమారుడు ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఇక ఇప్పుడు ఆయన వారసుడు భవిష్యత్తులో మహారాష్ట్రలో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న వ్యక్తి. ఆయన తాజాగా  లాక్ డౌన్  సమయంలో పబ్బులు రాత్రి పగలు ఉండేలాగా.. పాత రోజులు లాగా బార్ డాన్స్ లు కూడా అన్ని జరిపి  టూరిజం ద్వారా కోట్లకు కోట్లు సంపాదన సాధించవచ్చునని ఒకటి   ప్రతిపాదించడం.. దానికి అంగీకరిస్తూ నాన్న గారైన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఓకే చేయడం. దాని తర్వాత ఎన్నో పరిణామాలు కూడా జరిగాయి. 

 


 అయితే ప్రస్తుతం కరోనా వైరస్ ను కట్టడి చేయలేక చేతులెత్తేసిన రాష్ట్రాలలో మొదటి మహారాష్ట్రలో  ఇలాంటి రాష్ట్రంలో మద్యం పాలసీ తీసుకురావాలని అనుకుంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే బీర్లు పెద్ద ఎత్తున తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మిగతా మద్యం కాకుండా కేవలం బీర్ వరకు మాత్రమే అమ్మాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో కేంద్రం మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది మద్యం అమ్మకాలు లాంటివి చేయకూడదు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తయారుచేసిన బీరు అని పాడై పోతున్నాయి. ప్రస్తుతానికి ఒక లక్ష లీటర్ల బిర్ ని  డ్రైన్ లో  పార  పోశారు అన్నటువంటిది తాజా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: