ప్రస్తుతం దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తిచెందిన కరోనా  వైరస్ ను కట్టడి  చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు అందర్నీ ఇంటికే పరిమితం కావాలని  వైరస్ నియంత్రణలో ప్రజల అందరి సహకారం కావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచనలు చేస్తున్నాయి. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్ల మీదకు వచ్చి యథేచ్ఛగా  తిరుగుతున్నారు. ఇక పోలీసులు ప్రాణాలకు పణంగా పెట్టి మరి విది  నిర్వహణలో రోడ్ల మీద నిలబడి ప్రజలను ఇంటికే పరిమితం కావాలంటూ  సూచనలు చేస్తున్నారు. అయితే పోలీసులు ఎన్నిసార్లు ప్రజలకు వినిపించినప్పటికీ ప్రజలు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

 

 లాక్ డౌన్  నిబంధనలు ఉల్లంఘించి బయటికి వచ్చిన ప్రజల పై లాఠీఛార్జ్ లాంటి కఠిన చర్యలు చేపట్టినప్పటికీ ఎక్కడ మార్పు  మాత్రం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు పోలీసులు చేసిన ఓ వినూత్న ఆలోచన సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎలాంటి మాస్కులు లేకుండా పని పాట లేకుండా లాక్ డౌన్  నిబంధనలు ఉల్లంఘించి రోడ్లమీద తిరుగుతున్న వారిని  భయపెట్టేందుకు.. పక్కనే ఒక ఆంబులెన్స్ లో కరోనా  వైరస్ సోకిన వ్యక్తి లాగా ఒక వ్యక్తి ని ఉంచి  నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఆంబులెన్స్ లో కి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అలా పంపిస్తుంటే నిర్లక్ష్యంగా రోడ్డు మీదికి వచ్చిన వారు లబోదిబోమంటున్నారు.దీనికి  సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెలుగు వైరల్ అయిన విషయం తెలిసిందే. 

 


 అయితే తాజాగా దీన్ని ఆంధ్ర పోలీసులు ప్రాక్టికల్ గా  చేసి చూపిస్తున్నారు. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే.. ప్రజలను  ఇంటికే పరిమితం అయ్యేలా చేయడానికి ఇలాంటి ఒక భయం పెట్టడం మంచిదే కానీ ఇలాంటి వాటి వల్ల కూడా కరోనా  వైరస్ సోకే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. అంబులెన్సులో  అంతకు ముందు ఎవరైనా కరోనా  రోగి నుంచి ప్రయాణించి ఉన్న.. లేకపోతే అంబులెన్స్ లోకి ఎక్కించిన  వారిలో ఎవరికైనా కరోనా ఉంటే  వారి వల్ల వేరొకరికి కూడా కరోనా వైరస్ సోకే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. అందుకే ఇలాంటివి చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: