ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎవరికి అర్థం కావటం లేదు. జాతీయ స్థాయిలో ఉన్న బిజెపి ఏదో విధంగా దక్షిణాదిలో పాగా వేయాలని శతవిధాల ప్రయత్నాలు ఎప్పటినుండో చేస్తుంది. కర్ణాటకలో బానే ఉన్నా తర్వాత తెలంగాణలో మెల్లమెల్లగా ఇటీవల బలపడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ లో ప్రరిస్థితి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి- టిడిపి పార్టీలు మినహా మిగతా ఏ పార్టీలు వచ్చినా గానీ పెద్దగా పుంజుకున్న దాఖలాలు కనబడటం లేదు. ఇటువంటి తరుణంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కూటమిగా బిజెపి ఉన్న టైంలో ప్రతిపక్షంలో ఉన్నా టిడిపి ప్లానింగ్ లో వై.సీ.పీ ని టార్గెట్ చేశారు. దీని వల్ల అప్పట్లో తెలుగుదేశం పార్టీకి బాగా లబ్ధి చేకూరింది. ఇదే సమయంలో  ప్రస్తుతం అధికారంలో వైసిపి నీ టార్గెట్ చేస్తూ ప్రశ్నిస్తూ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మళ్లీ అనుకోకుండా లబ్ధి చేకూరుతుంది. అధికార పార్టీ నీ ఎప్పుడూ ఎవరు ప్రశ్నించినా దాని వల్ల రాజకీయాల్లో ఎక్కువగా ప్రతిపక్ష పార్టీకి లాభం చేకూరుతుంది.

 

మరి ఇలాంటి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ పార్టీని ఎవరు ముందుండి నడిపిస్తున్నారో  ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ విషయంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హైదరాబాదులో ఉండి రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీని ప్రశ్నిస్తూ మీడియా సమావేశాలు పెడుతుంటే, ఇదే టైములో బిజెపి నాయకులు కూడా ప్రశ్నించడంతో చాలా వరకు క్రెడిట్ మొత్తం టిడిపి కి వెళ్తుంది. ఈ విషయాన్ని ఏపీ లో ఉన్న బిజెపి నాయకులు కూడా సరిగా పట్టించుకోవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నా గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మాత్రం సరైన రీతిలో ఒక ప్లానింగ్ ప్రకారం వెళ్ళటం లేదు.

 

అదే సమయంలో పార్టీలో కూడా గ్రూపు రాజకీయాలు ఉండటంతో స్వరం ఎంత గట్టిగా వినిపించిన చివరాకరికి సన్నగిల్లుతోంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే చాలా వరకు బిజెపి ఏపీలో బలపడే అవకాశం ఉంది. కానీ ఏదో పార్టీ అండర్ డైరెక్షన్ లో వెళ్తే మాత్రం బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం బలపడే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: