కరోనా వైరస్ యొక్క వ్యాప్తిని అదుపు చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అన్నీ దేశాలు ఇప్పటికే సంపూర్ణ లాక్ డౌన్ ను ప్రకటించేశాయి. ఇక వైరస్ ను సమూలంగా నాశనం చేసేందుకు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడానికి అనేక అవస్థలు పడుతున్నారు. క్రమంలో వారు చేస్తున్న ప్రయోగాలు మంచి సక్సెస్ రేటు సాధిస్తున్నప్పటికీ వ్యాక్సిన్ ఆమోదం పొంది విడుదల అయ్యేందుకు చాలా సమయం పట్టేలాగా కనిపిస్తుంది. అయితే లోపలే రోజుకి వేల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

 

ఇక భారతదేశంలో పరిస్థితి కూడా చాలా దారుణంగా తయారయింది. ఇప్పటికే 33 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.... వెయ్యికి పైన ప్రాణాలు పోయాయి. ఇటువంటి సమయంలో భారత డాక్టర్లు ప్లాస్మా థెరపీ అనే విధానం ద్వారా వైరస్ అంటుకున్న రోగిని స్వస్థ పరిచే పనిలో పడ్డారు. కరోనా నుండి కోలుకున్న వ్యక్తి యొక్క రక్తం నుండి తెల్ల రక్త కణాలు మరియు ఎర్ర రక్త కణాలను వేరు చేయగా వచ్చే ప్లాస్మా ద్వారా కరోనా వైరస్ ను కట్టడి చేయవచ్చు అన్నది వైద్య నిపుణుల వాదన.

 

అలా కోలుకున్న వారి రక్తం నుండి తీసిన ప్లాస్మా లో ఉండే యాంటిబాడీస్ అప్పటికే వైరస్ తో పోరాడి ఉంటాయి కాబట్టి కరోనా వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి కూడా ప్లాస్మా ఎక్కిస్తే అతను కూడా వైరస్ బారి నుండి బయట పడతాడు అని ఇప్పటికే అనేక కేసుల్లో రుజువైంది. ఇదే విషయాన్ని కేంద్రం కూడా స్పష్టం చేయడం జరిగింది. నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకున్న వారు తమ ప్లాస్మాను డొనేట్ చేసి ఇతరులను కాపాడాలని, ఇందులో మరే సందేహాలు పెట్టుకోనవసరం లేదని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: