కరోనా వైరస్ ఆంధ్ర ప్రదేశ్ లో తన సత్తా చూపిస్తోంది. రోజుకు చేపడుతున్న కరోనా నిర్థారణ టెస్టులు గణనీయంగా పెరగడంతో కేసులు సంఖ్య కూడా రాష్ట్రంలో బాగా పెరిగిపోతోంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుతున్నాయి.

 

గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 82 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే ఇక్కడ పరిస్తితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 1259కి చేరింది. నెంబరు తెలంగాణ ను మించి పోవడాం గమనార్హం.

 

ప్రస్తుతం రాష్ట్రం లో 181 క్లస్టర్ లు ఉన్నాయని... 121 అర్బన్, 60 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా 56 రెడ్, 47 ఆరెంజ్, 573 మండలాలు గ్రీన్ జోన్ లో  ఉన్నాయని వెల్లడించారు ఏపి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి.

 

మరీ ముఖ్యంగా మూడు జిల్లాలలోనే కరోనా దెబ్బ మామూలుగా లేదు. అవే కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లా.  రాష్ట్రంలో కరోనా కేసుల నమోదులో కర్నూలు జిల్లా 332 కేసులతో టాప్ లో ఉంది. తర్వాత 254 పాజిటివ్ కేసులతో గుంటూరు రెండో స్థానంలో ఉంది. 223 పాజిటివ్ కేసులతో కృష్ణా జిల్లా మూడో స్థానంలో ఉంది.

 

ఇక ఇప్పటీకీ విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోగా.. నిన్ననే శ్రీకాకుళం లో తొలిసారిగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజు కొత్తగా నమోదైన కేసుల్లో కర్నూలు జిల్లాలో 40, గుంటూరు జిల్లాలో 17, కృష్ణా జిల్లాలో 13, కడప జిల్లాలో 7, నెల్లూరు జిల్లాలో 3, చిత్తూరు జిల్లాలో 1 కేసు, అనంతపురం జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి

మరింత సమాచారం తెలుసుకోండి: