ఏపీ సీఎం జగన్ కరోనా ను సరిగ్గా అడ్డుకోలేకపోతు న్నారని ప్రతిపక్షనేత చంద్రబాబు ఇటీవల తరచూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. తానే ఇంకా సీఎంగా ఉన్నా అనే రేంజ్‌ లో హైదరాబాద్ లో కూర్చుని పార్టీ నేతలతో జూమ్ లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంటారు. జగన్ కు ఏం చేయాలో సలహాలు ఇస్తుంటారు. పాపం.. ఇప్పుడు అలాంటి చంద్రబాబుకే కరోనా షాక్ ఇచ్చేసింది.

 

 

చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ లోని ఉద్యోగికి కరోనా వచ్చిందన్న వార్త ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్ ఉప్పల్ లోని హెరిటేజ్ ప్లాంట్ లో ఒక సెక్యూరిటీ గార్డ్ కు కరోనా సోకిందట. అయితే యాజమాన్యం ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిందన్నది స్థానికుల ఆరోపణ. ఆ యువకుడికి తండ్రి ద్వారా కరోనా వచ్చిందని తెలుస్తోంది. ఇప్పుడు వీరి కాంటాక్ట్స్ 32 మందిని అధికారులు గుర్తించి వారందరిని క్వారంటైన్ కు పంపారు.

 

 

హెరిటేజ్ సెక్యూరిటీ గార్డును, అతని తల్లిదండ్రులను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటంటే.. సెక్యూరిటీ గార్డుకు కరోనా వచ్చిన విషయాన్ని అధికారులకు తెలపకుండా... సెక్యూరిటీ గార్డుతో సన్నిహితంగా మెలిగిన మరో ఆరుగురు సెక్యూరిటీ గార్డులతో పాటు మరికొందరని హెరిటేజ్ కంపెనీ ప్రతినిధులు క్వారంటైన్ లో ఉంచారట.

 

 

ఇప్పుడు ఈ హెరిటేజ్ కరోనా అంశం చంద్రబాబును ఇరుకున పెడుతోంది. రోజూ జగన్ ను విమర్శించే చంద్రబాబు... సొంత కంపెనీలో కరోనా రాకుండా జాగ్ర్తతలు తీసుకోలేదా అన్న వాదన వినిపిస్తోంది. మరి దీనికి తెలుగు దేశం అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఏమని సమాధానం చెబుతారో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: