దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల క్రితం భారీ సంఖ్యలో కేసులు నమోదైనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రాష్ట్రంలో మొన్న 2 కరోనా కేసులు నమోదు కాగా నిన్న 6 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1009కు చేరింది. కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో ప్రజల్లో  భయాందోళన తగ్గింది. 
 
తాజాగా టైమ్స్ నౌ సంస్థ తెలంగాణతో సహా దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఆంక్షలను సడలించే అవకాశం ఉందని అంచనా వేసింది. తెలంగాణ, ఉత్తరాఖాండ్, హర్యానా, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు కరోనాను కట్టడి చేయడంలో సక్సెస్ అవుతున్నాయి. ఏపీలోను ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని టైమ్స్ నౌ అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో లాక్ డౌన్ ఎత్తేస్తే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొంది. 
 
తెలంగాణలో లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తే రాష్ట్ర ప్రజలకు శుభవార్త అని చెప్పవచ్చు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కేసుల తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ నిబంధనల సడలింపుపై ఆసక్తి చూపలేదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో నిబంధనల సడలింపుకే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉంది. లాక్ డౌన్ వల్ల తెలంగాణ ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. 
 
తెలంగాణలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం వెనుక సీఎం కేసీఆర్, అధికార యంత్రాంగం కృషి ఎంతో ఉంది. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయించటంతో పాటు కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు చేపట్టారు. ఎక్కడైనా అధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైతే ఆ ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు చేపట్టారు. స్వయంగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: