తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అపర అన్నపూర్ణ గా డొక్కా సీతమ్మ చాలా ప్రసిద్ధి చెందారు. ఆకలవుతుందని వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్నదానం చేసేవారు. ఆమె దానగుణానికి బ్రిటిష్ ఇండియా చక్రవర్తి ఏడవ ఎడ్వర్డ్ కూడా ఫిదా అయిపోయారు. 1903 వ సంవత్సరం లో తన పట్టాభిషేక వార్షికోత్సవానికి తప్పకుండా రావాలంటూ డొక్కా సీతమ్మ సాక్షాత్తు ఆయనే ఓ లేక పంపించాడు అంటే ఆమె ఎంత గొప్పవారో అర్థం చేసుకోవచ్చు. తనకోసం ఎవరైనా వస్తున్నారని తెలిస్తే... ఆమె పనిగట్టుకొని మరీ అన్నదానాల కార్యక్రమాలు చేపడతారు. ఆమె దానగుణాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆమె విగ్రహాలు ఎన్నో కట్టించబడ్డాయి. సీతమ్మ మరణించి 111 సంవత్సరాలు గడిచినప్పటికీ ఆమె ప్రజల హృదయాల్లో బ్రతికే ఉన్నారు.


అయితే నిన్న అనగా ఏప్రిల్ 28వ తేదీన డొక్కా సీతమ్మ గారి వర్ధంతి. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా సీతమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు. ' నేడు ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి వర్ధంతి. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని కొనసాగిస్తాం' అని పవన్ తన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. నిజానికి సీతమ్మ అంటే పవన్ కళ్యాణ్ కి మిక్కిలి ఇష్టం. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ పేరిట ఆహార శిబిరాలను కట్టించారు.


ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారతదేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతుండగా... పట్టెడన్నం దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పేదవారికి నిత్యావసర సరుకులు అందజేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు జనసైనికులు. వీరి ద్వారా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తిని తాము ముందుకు తీసుకు వెళ్తున్నాము అని పవన్ చెప్పుకొచ్చారు. డొక్కా సీతమ్మ తెలుగు బిడ్డగా జన్మించడం అనేది మనందరికీ గర్వకారణమని ఆయన అన్నారు. ఆమె మరణించి 100 ఏళ్ళు దాటినా... ఇప్పటికీ ప్రజల గుండెల్లో చెక్కుచెదరకుండా నిలిచిపోయారని ఆయన తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: