ప్రస్తుతం కరోనా  వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ను  కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్  విధించిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్  విధించినప్పటికీ కరోనా  వైరస్ ప్రభావం మాత్రం ఎక్కడా తగ్గకపోవడంతో లాక్ డౌన్  పొడగిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఏప్రిల్ 15వ తేదీన లాగ్ డౌన్  పొడిగించింది కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం మే 3వ తేదీ తర్వాత కూడా మళ్లీ లాక్ డౌన్ పొడిగించే  అవకాశాలు ఉన్నాయి అనే వాదన  కూడా బలంగా వినిపిస్తోంది. అయితే ఈ కరోనా  వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఉద్యోగులు వ్యాపారులు సామాన్య ప్రజలు అందర్నీ ఇంటికే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన  విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అన్ని కంపెనీల ఉద్యోగులు  ఇంటి నుంచి పని చేయాలంటూ  సూచనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. 

 

 

 ప్రస్తుతం ఐటి కంపెనీల ఉద్యోగులతో పాటు అందరూ ఉద్యోగులు ఇంటి నుండే  పనిచేస్తున్నారు. మరి ఈ వర్క్ ఫ్రొం  హోమ్ అనేది ఎప్పుడు పూర్తవుతుంది అనే దానిపై మాత్రం ఎవరికి స్పష్టత లేదు. అయితే ఇప్పట్లో వర్క్ ఫ్రొం హోమ్ అంటూ ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లే అవకాశం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే తాజాగా దీనికి సంబంధించి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్ని రాష్ట్రాలలోనూ ఐటీ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐటీ కంపెనీలతో పాటు బీపీఓ  సంస్థల్లోని ఉద్యోగులు జూలై 31 వరకు వర్క్ ఫ్రొం హోమ్ పాటించాలని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. 

 

 

కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్. ఇక అంతకుముందు వరకు కేంద్ర ప్రభుత్వం ఐటీ ఉద్యోగులందరికీ ఇంటినుంచే పనిచేసేందుకు ఇచ్చిన  అనుమతి నెల 30వ తేదీతో ముగియాల్సి  ఉండగా... ఐటీ బీపీఓ కంపెనీల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జూలై 31 వరకు ఐటీ బీపీఓ కంపెనీలు ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసేలా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అయితే తమ తమ ఉద్యోగులను దశలవారీగా మళ్ళి ఆఫీసులకు రప్పించాలని ఐటీ బీపీఓ  కంపెనీలు భావిస్తున్నాయని ఇలాంటి నేపథ్యంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఐటీ కంపెనీలకు ఉపకరిస్తుంది అంటూ పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: