ఎక్కడో చైనాలోని పుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించి మరణశాసనాన్ని లిఖిస్తుంది.  ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం ఒక్క రోజే ప్రపంచవ్యాప్తంగా 75563 కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య. 3135509కి చేరింది.  కరోనా ఒక్కసారిగా పెరగడానికి అమెరికా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అక్కడ నిన్న ఒక్క రోజే... 24884 కేసులు రావడంతో... మొత్తం కేసుల సంఖ్య 1035240కి చేరింది. అలాగే... నిన్న ఒక్క రోజే 2429 మంది చనిపోవడం ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాన్, కెనడా వంటి దేశాల్లో కరోనా మెల్లగా కంట్రోల్ అవుతుంటే... బ్రిటన్, టర్కీ, రష్యా, బ్రెజిల్, పెరు వంటి దేశాల్లో కొత్త కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

 

భారత్‌ విషయానికి వస్తే.. లాక్‌డౌన్‌ ఆంక్షలను కఠినంగా అమలు చేస్తుండడం వల్ల కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ మన దేశంలో ఒక్కరోజే అత్యధిక కేసులు నమోదైంది ఏప్రిల్‌ 18న. ఆరోజు మన దేశంలో  2,154 మందికి వైరస్‌  పాజిటివ్‌ వచ్చింది. ఆ తర్వాత ఏ రోజూ ఆ స్థాయిలో కేసులు నమోదు కాకపోవడం ఉరట కలిగించే విషయం.   దేశంలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటింది.  సుమారు 1007 మంది వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. మ‌రో 31 వేల పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

 

గ‌త 24 గంట‌ల్లో 73 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశ‌వ్యాప్తంగా సుమారు 7696 మంది రోగులు వైర‌స్ నుంచి కోలుకున్నారు. అయితే దేశంలో ఎంత కట్టుదిట్టాలు చేసినా కొంత మంది నిర్లక్ష్య దోరణి వహిస్తున్నారు.. ఇక విదేశాల నుంచి వచ్చినవారికి.. ఇటీవల మర్కజ్ ప్రార్థనలో పాల్గొన్న వారి వల్ల ఇంకా ప్రమాదం పొంచి ఉందనే అంటున్నారు.  ఇలా కొనసాగితే.. భవిష్యత్ లో మనిషి మనుగడ కష్టమే అఅంటున్నారు.. అంతేకాదు కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగించాలన్న మాటే వినిపిస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: