కరోనా కారణంగా ఎక్కువగా బాధపడుతున్న దేశాల జాబితాలో ఇప్పుడు మరో కొత్త దేశం చేరింది. ఇప్పటి వరకూ ఎక్కువగా బాధిత దేశాలుగా ఉన్న అమెరికా, ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్, లండన్ ల కంటే ఈ కొత్త దేశంలో ఎక్కువగా కరోనా విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ దేశం ఏంటి.. ఎందుకు అనూహ్యంగా ఇలా కొత్తగా తెరపైకి వచ్చింది.. తెలుసకుందాం..

 

 

ఆ కొత్త దేశం బ్రెజిల్.. ఇప్పుడు బ్రెజిల్‌లో కరోనా ఉద్ధృతి బాగా పెరుగుతోంది.

ఇక్కడ కరోనా ఎంతగా విజృంభిస్తోందంటే.. కొవిడ్‌ బాధితుల వెల్లువతో తమ ఆస్పత్రి వ్యవస్థలు కుప్పకూలే దశకు చేరుకున్నాయని అక్కడి పలు నగరాల పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రెజిల్ లోని పెద్ద నగరాల్లో ఒకటైన రియో డి జెనీరోతో పాటు మరో నాలుగు నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉందట.

 

 

అధికారిక గణాంకాల ప్రకారం ఆ దేశంలో ఇప్పటికే 70 వేలమందికిపైగా వైరస్‌ బారిన పడ్డారు. దాదాపు 5000కుపైగా చనిపోయారు. అయితే ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువే మరణాలు చోటు చేసుకున్నాయని భావిస్తున్నారు. ఎందుకంటే.. ఆ దేశంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగడం లేదు.

 

 

అంతే కాదు.. కరోనా వైరస్‌ బారిన పడ్డవారిలో చాలామంది ఇళ్లలోనే ఉంటున్నారు. అయితే అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ తరహాలోనే ఇక్కడ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్‌ బొల్సొనారో కూడా కరోనాను లైట్ గా తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఆయన కూడా మొదట్లో కొవిడ్‌ను చిన్న ఫ్లూ అంటూ కొట్టిపారేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: