లాక్‌డౌన్‌లో చిన్న చిన్న సరదాలకు దూరమైన వారి కోర్కెలను పోలీసులు తీర్చుతూనే ఉన్నారు. ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన రంజీ మాజీ క్రికెటర్ భార్య పుట్టిన రోజు సందర్భంగా కేకు అందించిన పోలీసులు తాజాగా మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. తాజాగా ఏడాది వయసు ఉన్న చిన్నార పాప ప్రస్తుతం హైదరాబాద్ లోని బర్కత్ పురాలో తాతయ్య వద్ద ఉంటోంది. తల్లిదండ్రులు సందీప్, హరిణి అమెరికాలోని బోస్టన్ లో ఉంటున్నారు. లాక్ డౌన్ వారి మధ్య దూరాన్ని పెంచింది.   దీంతో తమ కూతురు మైరాకు పుట్టిన రోజు నిర్వహించేందుకు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో  ఆ తల్లిదండ్రులు ఎంతో ఆవేదనకు గురి అయ్యారు.

 

ఈ నేపథ్యంలో ఇక్కడే పాప పుట్టిన రోజు చేయాలని నిర్ణయించిన గ్రాండ్ పేరెంట్స్, పాపకు విషెస్  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌‌కు తెలిపారు. వెంటనే ఆయన తన సిబ్బందితో కలిసి చిన్నారి నాయనమ్మ ఇంటికి వచ్చారు. ఆపై మైరా పుట్టిన రోజును జరిపించారు. బహుమతిగా ఓ టెడ్డీ బేర్ బొమ్మ ముఖానికి మాస్క్ వేసి ఇచ్చారు. ఆరోగ్యం, పరిశుభ్రత, ముందు జాగ్రత్త ముఖ్యమన్న సందేశాన్ని ఇచ్చేందుకే ఈ బహుమతిని ఎంచుకున్నామని ఈ సందర్భంగా అంజనీ కుమార్ మాట్లాడుతూ.. మైరా తల్లిదండ్రులతోనూ ఫోన్ లో మాట్లాడామని  తమ బిడ్డ తొలి పుట్టినరోజు ప్రతి తల్లిదండ్రులకూ ఎంత ముఖ్యమో నాకు తెలుసు.

 

ఈ సమయంలో వారు ఇక్కడ ఉండాల్సింది. కానీ ప్రపంచంలో పరిస్థితిలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని.. కరోనాని అరికట్టేందుక అన్ని దేశాల వారు పోరాడుతున్నారని అన్నారు.  అందుకే పాప పుట్టినరోజును జరిపించాలని హైదరాబాద్ పోలీసుల తరఫున నిర్ణయించాం" అని అన్నారు. తామిచ్చిన తొలి బర్త్ డే గిఫ్ట్ పాప గుర్తుంచుకుంటుందనే భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బ్లూ టూత్ ద్వారా ముందే రికార్డు చేసిన 'హ్యాపీ బర్త్ డే' సాంగ్ ను కూడా పోలీసులు వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: