గుజరాత్ తీరానికి చేపల వేటకు వెళ్లి లాక్ డౌన్ వల్ల  ఉత్తరాంధ్ర కు చెందిన దాదాపు 3800 మంది మత్స్య కారులు అక్కడే చిక్కుకుపోయారు. దాంతో తిండి లేక వారు నానా అవస్థలు పడ్డారు. అయితే ఈ విషయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి రావడం తో వారిని అన్నివిధాలా ఆదుకోవాలని గుజరాత్  ముఖ్యమంత్రి విజయ్ రూపానిని కోరగా గుజరాత్ సర్కార్ వారికి ఆశ్రయం కల్పించింది. ఇక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో వారిని సొంత ఊళ్లకు రప్పించడానికి ప్రయత్నాలు జరుగాయి. ఈప్రయత్నాల్లో భాగంగా వారిని తరలించడానికి గుజరాత్ సర్కార్ 200 బస్సులను సిద్ధం చేసింది. నిన్న సాయంత్రం 36 ప్రత్యేక బస్సుల్లో కొంత మందిని తరలించింది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం సహాయనిధి నుండి 3కోట్ల రూపాయలను విడుదలచేసింది. 
 
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపాడు. సొంతఊళ్లకు ఉత్తరాంద్ర మత్స్య కారులు తరలించేందుకు సహాయపడిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు కిషన్ రెడ్డి , విజయ్ రూపాని గార్లకు కృతజ్ఞతలు అలాగే ఇందుకోసం నిధులు విడుదలచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి  అభినందనలు తెలియజేస్తున్నాని పవన్ ట్వీట్ చేశాడు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: