ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్ జిల్లాలో సోమవారం రాత్రి ఇద్దరు సాధువులు  హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో ప్రజలందరూ ఇంటికే పరిమితమైన వేళ ఈ ఆలయాన్ని మూసివేసిన సమయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురికావడం కలకలం రేపింది . అయితే ఈ కేసుకు సంబంధించి ఓ నిందితుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ ఇద్దరు సాధువులను సదరు వ్యక్తి ఎందుకు చంపాడు అనే కోణంలో నిందితుడిని విచారణలో పలు ప్రశ్నలు అడిగారు పోలీసులు. ఈ సందర్భంగా నిందితుడు చెప్పిన సమాధానాలతో పోలీసులు షాక్ కి గురయ్యారు. 

 

 

 ఇద్దరు సాధువుల ను ఎందుకు చంపావు అంటూ విచారణలో భాగంగా పోలీసులు నిందితున్ని ప్రశ్న అడుగ్గా ... అందరూ అవాక్కయ్యే సమాధానం చెప్పాడు సదరు నిందితుడు. ఈ ఇద్దరు సాధువుల హత్య కేసుల అరెస్ట్ అయిన మురళీ అలియాస్ రాజు నుండి  హత్యకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు విచారించారు  పోలీసులు. అయితే విచారణలో భాగంగా తనకు ఆ సాధువులతో ఎలాంటి శత్రుత్వం లేదు అని దేవుని కోరిక మేరకే ఆ ఇద్దరు సాధువుల చంపినట్లు నిందితుడు మురళి విచారణలో తెలిపాడు. 

 

 

 ఆ ఇద్దరు సాధువుల వద్ద ఉన్న చిమ్న దొంగలించిన విషయంలో సాధువు రంగి దాస్ తో పాటు అతడి శిష్యులు షేర్ సింగ్ తో మురళికి రెండు రోజుల క్రితమే వాగ్వాదం జరగ్గా  సోమవారం... బాంగ్ తిన్న  మత్తులు ఆలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఇద్దరు సాదువులు  అక్కడికక్కడే మరణించారు. ఇదిలా ఉంటే మురళి పలుమార్లు కత్తితో సంచరించినట్లు అటు గ్రామస్థులు కూడా చెబుతున్నారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ఆధారంగానే మురళిని అనుమానితుడిని అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: