ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతోంది. సామాన్యులు సెలబ్రిటీలు వ్యాపారులు ఉద్యోగులు అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. ఇక ప్రజలందరినీ ఇంటికే పరిమితం అయ్యేలా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నో చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్బును వారి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ... సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం నిత్య అవసరాలు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అందుకే తినడానికి తిండి కూడా లేదు. ఓవైపు కరోనా  వైరస్పై యుద్ధం చేస్తూనే మరోవైపు కడుపు నింపుకోవడానికి యుద్ధం చేస్తున్నారు చాలా మంది సామాన్య ప్రజలు. 

 

 

 ఇంకొంతమంది ఎలాంటి ఉపాధి కూడా లేకపోవడంతో డబ్బుల్లేక నిత్యావసరాలు ఎవరైనా అరువు  ఇస్తే బాగుండు  అని ఆలోచిస్తున్నారు. ఇలా డబ్బులు లేక అరువు  ఇస్తే బాగుండు అని అనుకుంటున్నా చాలామంది కోరికను నెరవేర్చేందుకు సిద్ధమైంది అమెజాన్. మామూలుగానే నిత్యావసరాలకు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరం పట్టణాలలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఆన్లైన్ సంస్థలు ప్రజలందరూ ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండేలా చేసేందుకు నిత్యావసరాల లో డోర్ డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. 

 

 

 

 అయితే తాజాగా అమెజాన్ మరో ముందడుగు వేసి ప్రజలకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు సిద్ధమయ్యింది. లాక్ డౌన్  సమయంలో డబ్బు లేక చాలా మంది నిత్యావసరాలు కొనేందుకు  ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్ పే లెటర్ అనే ఒక వినూత్న సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సర్వీస్ను ఇండియాలో లాంచ్ చేశారు అమెజాన్ నిర్వాహకులు. ఇందులో భాగంగా అమెజాన్ ద్వారా కావలసిన నిత్యావసర సరుకులు కొనుక్కుని... దానికి సంబంధించిన బిల్లు లో కొన్ని రోజుల తర్వాత కట్టుకోవడానికి వీలు కల్పిస్తోంది.  కొన్ని రోజుల తర్వాత కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్న సమయంలో దానిని ఈఎమ్ఐ గా కూడా మార్చుకోవచ్చు. ఈఎమ్ఐ మార్చుకున్నప్పుడు మాత్రం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అని ఆమెజన్  తెలిపింది. ఏమైనా ప్రస్తుతం అమెజాన్ తీసుకున్న  నిర్ణయం  సామాన్య ప్రజలకు కాస్త ఊరట కలిగించే అంశం.

మరింత సమాచారం తెలుసుకోండి: