పంజాబ్‌లో లాక్‌డౌన్ మే 17 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అమ‌రింద‌ర్‌సింగ్ స్ప‌ష్టం చేశారు. పంజాబ్‌లో కేసుల సంఖ్య అధికంగా ఉండ‌టం..కొత్త‌గా న‌మోద‌వుతున్నకేసులు కూడా ప‌దుల సంఖ్య‌లో ఉండ‌టంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న బుధ‌వారం  మీడియా ద్వారా రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తెలిపారు. మిగ‌తా అన్నింటికంటే ప్ర‌జ‌లే త‌మ ప్ర‌భుత్వానికి ఎంతో ముఖ్య‌మని తెలిపారు. వాస్త‌వానికి మే3తో ప్ర‌ధానమంత్రి మోదీ విధించిన లాక్‌డౌన్ గ‌డువు ముగిసిపోతోంద‌ని అంతా అనుకున్నారు. అయితే అనుహ్యంగా రాష్ట్రంలో కేసులు పెరుగుతుండ‌టంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడ‌గిస్తూ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.


అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు, నిత్యావ‌స‌రాల కొనుగోలుకు మాత్రం కాస్త స‌డ‌లింపునిచ్చింది. నిత్యావ‌స‌రాల‌కు ప్ర‌తీ రోజూ ఉద‌యం7 నుంచి 11గంట‌ల వ‌ర‌కు బ‌య‌ట‌కు వెళ్లి కొనుగోళ్లు చేప‌ట్టేందుకు అనుమ‌తినిచ్చింది. అయితే కొనుగోలు స‌మ‌యంలోనూ సామాజిక దూరం పాటించాల‌ని సూచించింది. ఇక రెడ్‌జోజ‌న్‌, కంటైన్మెంట్ ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేసింది. నిత్యావ‌స‌రాలు స‌హ మిగ‌తా ఏ అవ‌స‌ర‌మైనా అధికారులే డోర్ డెలివ‌రీ చేస్తారు. ఇదిలా ఉండ‌గా అత్య‌వ‌స‌ర‌మైన వ‌స్తువుల‌, ఉత్పత్తుల‌కు సంబంధించిన ఫ్యాక్ట‌రీల‌ను న‌డుపుకునేందుకు అనుమ‌తిస్తున్నారు.


మార్చి 24 నుంచి పంజాబ్‌లో లాక్‌డౌన్ అమ‌ల‌వుతూ వ‌స్తోంది. అయితే క‌రోనా కేసులు మొద‌ట పెద్ద‌గా న‌మోదు కాలేదు. గ‌డిచిన 15రోజుల నుంచి మాత్రం క్ర‌మంగా పెరుగుతూ వ‌స్తున్నాయి. మ‌ర‌ణాల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంటోంది. ఢిల్లీకి ద‌గ్గ‌ర‌గా ఉండటంతో వైర‌స్ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంద‌నే వారు ఉన్నారు. అక్క‌డి నుంచి స్వ‌రాష్ట్రంలోకి కొంత‌మంది వ‌చ్చేస్తూ వైర‌స్‌ను స్థానికంగా వ్యాపింప‌జేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా వివిధ రాష్ట్రాల్లో పంజాబ్‌కు చెందిన లారీ డ్రైవ‌ర్లు, హ‌ర్వెస్ట‌ర్ల డ్రైవ‌ర్లు ద‌క్షిణాది రాష్ట్రాల్లో వేలాదిగా చిక్కుక‌పోయారు. వారంద‌రినీ స్వ‌రాష్ట్రాల‌కు పంపాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: