ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న  నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులో  భాగంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అదనపు మార్గదర్శకాలను జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్ లో అమిత్ షా ఇచ్చిన సూచనల మేరకు కొత్త మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగం, ఉద్యానవన రంగం  వంటి పనులకు మినహాయింపు ఇవ్వాలని సూచించింది కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా గ్రామాల్లో నిర్మాణ పనులకు కూడా మినహాయింపు ఉండేలా మార్గదర్శకాలను విడుదల చేసింది. పెద్ద పెద్ద మాల్స్ తప్ప గ్రామాలు పట్టణాల్లో ఉండే చిన్న చిన్న దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలిపింది. ఇక ఆన్లైన్ సంస్థలు  అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి సేవలు కూడా కొనసాగుతాయని వీటికి కూడా అనుమతి ఇచ్చేలా మార్గదర్శకాలను సిద్ధం చేసింది.

 

 

 ఇక ఓడలకి కూడా ప్రత్యేక నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఇవ్వాలని మార్గదర్శకాలను జారీ చేసింది ప్రభుత్వం. అంతే కాకుండా మరిన్ని మినహాయింపునకు ఇచ్చేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది  రాష్ట్ర ప్రభుత్వం. అయితే కేవలం కరోనా వైరస్ లక్షణాలు లేని వారు మాత్రమే విధులకు హాజరు కావాలని సూచించింది. అంతే కాకుండా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన కార్మికులు అక్కడి నుంచి పని చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం సూచనలు చేసింది. 

 

 

 దాదాపుగా నెల రోజులకు పైగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాకముందే కొన్ని సడలింపులు చేయడం ద్వారా... మరికొన్ని నిబంధనలతో కరోనా  వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఓవైపు ప్రజల్లో సానుకూలత తీసుకొస్తునే  మరోవైపు కఠిన ఆంక్షలను  అమలు చేసేందుకు సిద్ధం అయ్యాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు..

మరింత సమాచారం తెలుసుకోండి: