ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తూ ఉంటే, మరోవైపు మహమ్మారిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధానం అమలు చేస్తూ ఉన్న కూడా బ్యాంకులు వారి సేవలను వారు అందిస్తున్నారు. మరోవైపు దేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఎదుర్కొంది అనే చెప్పాలి. ఇక ఈ సమయంలో బ్యాంకులో సేవలు ప్రజలకు అండగా నిలుస్తుంది.  ఇక మే నెలలో బ్యాంకు సెలవులు తెలుసుకొని ముందు జాగ్రత్తగా బ్యాంకులో పని ఉంటే పూర్తి చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా  లాక్ డౌన్ విధానం అమలుతో బ్యాంకు సేవలు కూడా సమయాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి మాత్రం అన్ని బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే పనులు నిర్వహిస్తున్నారు. 

 


ఇక మే నెలలో 13 రోజులపాటు బ్యాంకులు సెలవులు రాబోతున్నాయి. సాధారణంగా బ్యాంకులో పని చేయని రెండు శనివారాలు, ఐదు ఆదివారాలు.. దీనితో పాటు పండుగలు అలాగే స్పెషల్ హాలిడేస్ ఉండడంతో బ్యాంకులు కొన్ని రోజులు మాత్రమే పనిచేస్తాయి. ఇక మరోవైపు స్టాక్ మార్కెట్లు మే 1, మే 25న కూడా పని చేయవు.  ఒకవేళ మీరు కొత్త డెబిట్ క్రెడిట్ కార్డు కావాలి అనుకుంటే బ్యాంకులను సంప్రదించాలి. అలాగే కాకుండా ఆర్థిక కార్య కలాపాలు జరపాలి అంటే కచ్చితంగా బ్యాంకుకి వెళ్లాల్సిందే. మీరు బ్యాంకు బయలుదేరే ముందు ఒక వేళా బ్యాంకు పనిచేస్తుందో లేదో ఒకసారి చూసుకుని బయలుదేరితే చాలా మంచిది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీకు కావాల్సిన సేవలు పొందవచ్చు.

 

 

ఇక బ్యాంకు సెలవులు వివరాలు ఇలా ఉన్నాయి. మే 1 - అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం, మే 3 - ఆదివారం, మే 7 - బుద్ద పూర్ణిమ, మే 8 - రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి, మే 9 - రెండో శనివారం, మే 10 - ఆదివారం, మే 17 - ఆదివారం, మే 23 - నాలుగో శనివారం, మే 24 - ఆదివారం, మే 25 - రంజాన్, మే 31 - ఆదివారం ఈ విధంగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: