ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. అందులో ఎవరికీ డౌట్లు లేవు. నిజానికి ఆయన రాజకీయ జీవితం ప్రారభించేనాటికి ఇపుడు ఏపీని ఏలుతున్న వారు ఎవరూ లేరు. చంద్రబాబుది నాలుగున్నర దశాబ్దాల రాజకీయం. నిజానికి  ఆయన ఈ పాటికి రాజకీయంగా జాతీయ స్థాయిలో వెలగాలి.

 

లేకపోతే రామాక్రిష్ణా అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేయాలి. కానీ చంద్రబాబుకు రాజకీయమే ఊపిరి కదా. అందుకే ఆయన ఇకా తన కొడుకు స్థాయి జగన్ తో పోటీ పడుతున్నారు. రాజకీయంగా ఆరాటపడుతున్నారు. దానికి తోడు ఆయన హైదరాబాద్ లో కూర్చుకుని చేస్తున్న విమర్శలు, రాజకీయం కూడా బూమరాంగ్ అవుతున్నాయి.

 

బాబు నీవు ఎక్కడో కూర్చుని రాజకీయం చేయడమేంటి. మాకు నీతులు చెప్పడమేంటి, నీవు అసలు ఎక్కడ, ఏపీ ఆపదలో ఉంటే వందల కోట్ల భవనంలో విలాసాలు చేస్తూ బురద జల్లుతావా అంటూ వైసీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి వంటి వారు దులుపి పారేస్తున్నారు. ఇక మంత్రి అనిల్ కుమార్ అయితే బాబుకు ఏపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అంటున్నారు.అసలు ఏపీలో నీకు సొంత ఇల్లు ఉందా. ఎందుకు ఇక్కడ రాజకీయం నీకు అంటూ తగులుకుంటున్నారు.

 


చంద్రబాబు విషయం తీసుకుంటే ఆయన ఏపీకి రాలేకపోతున్నారు. అక్కడే ఉంటూ రాజకీయం చేయడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నారు. అదే టైంలో వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. సెల్ఫ్ క్వారైంటైన్ బాబు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పేరు పెట్టేశాబు. కరోనాను ఎదుర్కోవడం అంటే దోమలు పట్టడం అనుకున్నావా బాబూ... ఎక్కడో కూర్చుని ఊసుపోని కబుర్లు చెప్పవద్దు అంటున్నారు.

 

ఇక మరో వైపు వైసీపీ నేతలు బాబుతో చెడుగుడే ఆడుతున్నారు. బాబు ఇప్పటీకిపుడు  ఏపీకి రావాలి అపుడే మాట్లాడాలి అంటున్నారు. చంద్రబాబు అక్కడే దొరికిపోతున్నారు. ఇక అధినేత పరాయి రాష్ట్రంలో, నేతలు వేరే లోకల్ గా ఉంటూ చేస్తున్న ఆరొపణలతో టీడీపీ పరువు పోతోందన్న మాట కూడా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: