క‌రోనా వైర‌స్ ఉధృతంగా కొన‌సాగుతుండ‌టంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త నెల‌న్న‌ర రోజులుగా దేశ‌ప్ర‌జ‌లంతా ఇంటికే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్టే ప‌రిస్థితి లేదు. ఇక పెళ్లి చేసుకోవాల‌నే వారి క‌ష్టాల‌తై వ‌ర్ణ‌నాతీతం. ముహూర్తం దాటిపోతే మ‌ళ్లీ చాలా కాలం పాటు వేచి చూడాల‌ని టెన్ష‌న్ ప‌డుతున్నారు. అలా అని ఇప్పుడు చేసుకోలేని ప‌రిస్థితి. అయితే కొంత‌మంది మాత్రం ముహూర్తం టైంకు పెళ్లి చేసేసుకుని త‌ర్వాత రిసెప్ష‌న్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకునే ఉద్దేశంతో పెళ్లి తంతు కానిస్తున్నారు. 


 మే3 త‌ర్వాత పెళ్లిళ్లు జ‌రుపుకునేందుకు చాలామంది పెళ్ల‌కానిప్ర‌సాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే అలాంటి వారికి కేంద్రం శుభం అంటూనే ఆంక్ష‌ల అక్షింత‌ల‌ను నెత్తిన చ‌ల్లుతోంది.  మే 3వ తేదీ తర్వాత పెళ్లి చేసుకునే వారికి అధికారిక అనుమతి తప్పనిసరి చేసింది. ఇందులో ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా కొన్ని రూల్స్‌ను రూపొందించి జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.  ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న తరుణంలో ఈ  ఉత్త‌ర్వులు జారీ చేసింది. పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె తరుపున కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అంటే పెళ్లి కొడుకు ఆయ‌న త‌ల్లిదండ్రులు ఉంటారు.


 అలాగే పెళ్లి  కూతురు ఆమె త‌ల్లిదండ్రులు ఉంటారు. ఇక వారి కుటుంబ‌స‌భ్యుల్లోనే మ‌రో న‌లుగురికి అవ‌కాశం ఉంటుంది. ఈ పెళ్లికి త‌ప్ప‌నిస‌రిగా వ‌ధూవ‌రుల వివ‌రాలు, క‌న్యాదాత వివ‌రాల‌ను త‌ప్ప‌నిస‌రిగా రెవెన్యూ అధికారుల‌కు, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో అంద‌జేయాల్సి ఉంటుంది. పెళ్లిలో భౌతిక దూరం పాటించకుండా నిబంధనలు పాటించేలా చ‌ర్య‌లు తీసుకోవాలి. అందుకు సంబంధించిన ఏర్పాట్ల‌ను కూడా ముందే అధికారుల‌కు రాత పూర్వ‌కంగా తెలియ‌జేయాల్సి ఉంటుంది. పెళ్లికి హాజ‌రైన వారంద‌రు త‌ప్ప‌నిస‌రిగా మాస్కులు, శానిటైజర్లు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. 

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: