తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విస్తృతి త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు నివేదిక‌లు స్ప‌ష్టం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భుత్వం తీసుకుంటున్న వివిధ చ‌ర్య‌ల కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే, ఇదే స‌మ‌యంలో ఇత‌ర వైద్య సేవ‌లుకు ఇబ్బంది ఎదుర‌వుతున్నాయి. ర‌వాణా సేవ‌లు లేక‌పోవ‌డంతో ప్ర‌ముఖ ఆస్ప‌త్రులు సైతం సేవ‌లు అందించ‌లే‌ని ప‌రిస్థితి. ఇలాంటి త‌రుణంలో హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ ఆస్ప‌త్రి అయిన‌ నిమ్స్‌ ఆస్పత్రిలో అదునాతన సేవ‌లు అందుబాటులోకి తెచ్చారు. వ‌చ్చే మే నెల 1వ తేదీ నుంచి టెలీ కన్సల్టెన్సీ సౌకర్యం అందుబాటులోకి రానుంది.  ఈ విధానం రోగుల‌కు ఎంతో మేలు చేయ‌నుంది. 

 

కరోనా దృష్ట్యా సాధారణ రోగులకు ఉచితంగా టెలీమెడిసిన్‌ చికిత్సను నిమ్స్ వైద్యులు అందించనున్నారు. ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, రుమటాలజీ నిపుణులు టెలీ మెడిసిన్‌ ద్వారా సేవలు అందించనున్నారు. 040-23489244కు ఫోన్‌ చేసి అపాయింట్‌మెంట్‌ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు వైద్యులు సలహాలు, సూచనలు ఇవ్వనున్నారు. లాక్ డౌన్ కార‌నంగా వైద్య సేవ‌లు పొందేల‌ని వారు ఈ మేర‌కు టెలీ మెడిసిన్ సేవ‌లు ఉప‌యోగించుకోవాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. 

 

కాగా, తెలంగాణ‌లో కరోనా నివారణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గాంధీ తదితర ఆస్ప‌త్రి ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. దీనికి తోడుగా, నిమ్స్ ఆస్ప‌త్రిలోనూ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఎమర్జెన్సీ వార్డు పక్క భవనంలో ఏర్పాటు చేశారు. మొదటిదశలో పది పడకలతో ఏర్పాటు చేస్తుండగా, మొదటి ఫ్లోర్‌లో స్క్రీనింగ్‌, రెండో ఫ్లోర్‌లో ఐసీయూ, అక్కడే మరో గదిలో అబ్జర్వేషన్‌ కోసం కేటాయించారు. మొత్తం 40 పడకాలను ఏర్పాటు చేస్తామని వైద్యాధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిని, వ్యాధి లక్షణాలు ఉన్న వారిని ఇక్కడికి తరలించి రక్త నమూనాలను సేకరించడంతోపాటు వారికి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: