జగన్ ది రాజకీయంగా పదేళ్ళ అనుభవం. ముఖ్యమంత్రిగా నేరుగా కుర్చీ ఎక్కేశారు. ఏడాది దగ్గరపడుతోంది ఆయన సీఎంగా బాధ్యతలు స్వీకరించి. ఈ క్రమంలో జగన్ ఎన్నో సవాళ్ళు చూశారు. రాజకీయంగా ఆయన చంద్రబాబుతోనే తలపడుతున్నారు. ఇంకో వైపు వందేళ్ళకు ఒకసారి వచ్చే కరోనా లాంటి మహమ్మారి కూడా జగన్ సీఎం అయ్యాకే వచ్చింది.

 

దాంతో కొత్త అనుభవాలు కూడా ఎదురవుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ఇంతటి విషమ పరిస్థితుల్లో జగన్ బుర్ర పాదరసంగా పనిచేస్తోంది. ఆయన ముందు చూపుతోనే అడుగులు వేస్తున్నారని అంటున్నారు.లాక్ డౌన్ని ప్రకటించడం అంటే సులువు. దానికి బ్రేక్ చేయడం కష్టం. ఇపుడు అదే  దేశంలోని పెద్దలకు బుర్ర వేడెక్కిస్తోంది.

 

కానీ జగన్ దీనికి సరైన విధానంగా ముందే ఆలోచించిపెట్టుకున్నారు. అందుకే ఆయన ఏప్రిల్ 14 వరకూ విధించిన తొలి లాక్ డౌన్ సందర్భంగానే సడలింపులు వ్యవసాయానికి అవసరం అని ప్రధాని మోడీకే  చెప్పారు. ఆర్ధిక బండి కూడా నడవాలని చెప్పారు. ఇపుడు డేరింగ్ గా ప్రజలకు కరోనా వైరస్ గురించి  ఉన్న నిజాలు కూడా చెప్పేశారు.

 

కరోనా మహమ్మారికి మందు లేదు. కాబట్టి దాంతో సహజీవనం తప్పనిసరి అని కూడా జగన్ కుండబద్దలు కొట్టారు. బహుశా ఇదే మాట  ఇప్పటిదాకా ఎవరూ అనలేరు. ఈ దేశంలో అందరికీ తెలుసు. కరోనాని జీరో లెవెల్ కి తీసుకురాలేమని, అలాగని లాక్ డౌన్ని ఎంతకాలం కొనసాగిస్తారు. అందుకే జనానికి భయం పోగొట్టేలా జగన్ వ్యవహరిస్తున్నారు.

 

లాక్ డౌన్ సడలించి జనాలకు తమ విధులు చేసుకోవాలని, ప్రతీ ఒక్కరూ సామాజిక  దూరం పాటించాలని జగన్ సూచిస్తున్నారు. నిజమే ఎంత కాలమని ఇంట్లో భయపడి ఉంటారు. కరోనా గురించి పూర్తి అవగాహన జనాలకు తెలియచెస్తేనే వారు జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే వాక్సిన్ వస్తుందనో, ఫలనా తేదీలోగా కరోనా  తగ్గుతుందనో వారు ఎదురుచూస్తూ కూర్చుంటారు.  ఆ విధంగా ఉంటే అసలుకే ఏసరు. అందుకే జగన్ తనదైన శైలిలో అలా  చేశారనుకోవాలి.

 

మొత్తానికి పాలనాపరంగా పట్టు సాధించిన  జగన్ ప్రపంచంలో గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అనంతర మార్గాలు తెలియక‌ ఇబ్బంది పడుతున్న సమాజానికి కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. నిజంగా కరోనా వైరస్ ని అర్ధం చేసుకుని వాస్త ద్రుక్పధంతో ముందుకు సాగుతున్న సీఎంగా జగన్ని చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: