జగన్..కేసీయార్. ఈ ఇద్దరినీ తీసుకుంటే పోలిక ఏంటి అనాల్సిందే. ఎందుకంటే వయసు రిత్యా, అనుభవం రిత్యా కూడా కేసీయార్ జగన్ కంటే చాలా ఎక్కువ. ఆయన ఓ విధంగా తండ్రి స్థానంలో ఉన్నారు. కొడుకు వయసు ఉన్న జగన్ ఏపీకి సీఎం. ఇక జగన్ పాలనాపగ్గాలు చేపట్టి కూడా ఏడాది గట్టిగా కాలేదు.

 

మరో వైపు చూసుకుంటే ఏపీ పేద రాష్ట్రం. తెలంగాణా సంపన్న రాష్ట్రం. అయినా సరే కరోనా వైరస్ తరువాత లాక్ డౌన్ విధించిన నేపధ్యంలో పేదలను ఆదుకోవడంలో కేసీయార్ కంటే కూడా జగన్ ముందంజలో ఉన్నారని చెప్పాలి.  ఇప్పటికి మూడు సార్లు ఏపీలో రేషన్ సరుకులు జగన్ ఇచ్చారు. అదే విధంగా ప్రతీ ఒక్కరికీ వేయి రూపాయలు పంపిణీ చేశారు. కందిపప్పు రెండు సార్లు, శెనగలు ఒకసారి కార్డుకు కేజీ వంతున ఇచ్చారు. 

 

అదే విధంగా చూసుకుంటే ప్రతీ మనిషికి అయిదు కిలోలు వంతున బియ్యం రేషన్ కార్డులు జగన్ ఇచ్చారు. కానీ కేసీయార్ మాత్రం కార్డుకు పన్నెండు కేజీలు అన్నారు. కార్డు ఉన్న వారికి  తలా పదిహేను వందలు ఇస్తున్నట్లు చెప్పినా కూడా అది అందరికీ అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరి పేదలకు ఎక్కడా డొక్క మాడకుండా చూసుకుంటామని చెప్పిన కేసీయార్ ధనిక రాష్ట్రంలో వీటిని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో అర్ధం కాని విషయం.

 

అదే సమయంలో జగన్ మాత్రం ఏపీ ఎన్ని ఇబ్బందులో ఉన్న రేషన్ సరుకులు మూడు విడతలు ఇవ్వ్వడమే కాకుండా డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చారు. అదే విధంగా జగనన్న దీవెన పధకం ప్రారంభించి ఫీజ్ రీఇంబర్స్ మెంట్ కూడా పూర్తిగా చెల్లిస్తున్నారు.

 

ఓ విధంగా చెప్పాలంటే సంక్షేమంలో జగన్  ది బెస్ట్ గా అంతా అంటున్నారు. లాక్ డౌన్ వేళ ఏపీలో పేదలు ఇబ్బందులు పాలు కాకుండా చూసిన ఘనత కచ్చితంగా జగన్ దేనని కూడా కితాబు ఇస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే జగన్ ఈ విషయాల్లో కేసీయార్కే షాక్ తినిపించారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: