ఇండియాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు మూతపడిన గాని రోజు రోజుకీ పాజిటివ్ కేసులు బయట పడుతూనే ఉన్నవి. ఇటలీ, స్పెయిన్ మరియు అమెరికా వంటి దేశాలు కరోనా వైరస్ కట్టడి చేయడంలో చాలావరకు విఫలమయ్యాయి. ప్రభుత్వాలు ఇచ్చిన హెచ్చరికలు ఆ దేశస్తులు సరిగ్గా పాటించకపోవడంతో ప్రస్తుతం మూల్యం చెల్లించుకుంటున్నారు. కానీ దాదాపు ఇండియాలో మోడీ త్వరగా స్పందించడంతో దానికి దేశస్తులు కూడా సహకరించడంతో ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా వరకు బెటరే అని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఇండియా మరియు రష్యా ఒకేసారి లాక్ డౌన్ లు ప్రకటించడం జరిగాయి.

 

కానీ రష్యాలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. మన దేశంలో కంటే మూడింతలు ఎక్కువ కేసులు ఆ దేశంలో నమోదు అవుతున్నాయి. మన దేశ జనాభా తో పోల్చిన చాలా తక్కువ జనాభా కలిగిన దేశం రష్య. అయినాగానీ రష్యా దేశం లో కరోనా వైరస్ పూర్తిస్థాయిలో విజృంభణ చేస్తుంది. రోజుకి కొన్ని వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని జాగ్రత్తలు మరియు లాక్ డౌన్ పటిష్టంగా అమలు పరుస్తున్న గాని రష్యా దేశంలో పరిస్థితి కుద్దుట పడటం లేదు.

 

ఇటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి పై చాలా మంది శాస్త్రవేత్తలు అంటున్నది ఏమిటంటే. ఇండియాలో ఉన్న వాతావరణంలో కరోనా వైరస్ బలపడటానికి ఆస్కారం లేదని మే నెల ఆఖరి లోపు ఇండియాలో కరోనా వైరస్ అనేది ఇండియా లో కనబడే ఛాన్స్ లేదని అంటున్నారు. రష్యాలో అయితే వాతావరణం ఇండియాకి పూర్తి భిన్నంగా ఉంటుంది. వైరస్ బలపడటానికి అనుకూలంగా రష్యా లో వాతావరణం ఉండటం వల్లే ఇండియాలో కంటే రష్యా దేశం లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని శాస్త్రజ్ఞులు అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: