ప్రపంచ దేశాలలో కరోనా వైరస్ వల్ల చాలా మంది అమాయకులు మరణిస్తున్నారు. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ ప్రస్తుతం 200 దేశాలకు పైగా విస్తరించి ఉంది. ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ వైరస్ దెబ్బకి ప్రపంచ దేశాలలో ఉన్న పేదలు అనేక అవస్థలు పడుతున్నారు. మనిషి జీవితం ప్రశ్నార్థకంలో పడేసింది కరోనా. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చైనా విమర్శలు ఎదుర్కొంటోంది. వైరస్ భయంకరంగా చైనాలో విస్తరించిన టైంలో కేసులు తక్కువ చేసి చూపించి ప్రపంచాన్ని తప్పుదారి పట్టించింది అని మొదటి నుండి విమర్శలు వస్తూనే ఉన్నాయి. యూరప్ దేశాల మార్కెట్ ను దెబ్బకొట్టి ప్రపంచ ఆర్థిక రంగంలో నెంబర్ వన్ స్థానాన్ని చైనా అధిగమించడానికి కరోనా వైరస్ కుట్ర పన్నినట్లు అందుకే ఈ వైరస్ ప్రపంచ దేశాల మీదికి వదిలినట్లు వార్తలు ఎప్పటినుండో వినబడుతున్నాయి.

 

మరోపక్క కరోనా వైరస్ తో పోరాడుతున్న ప్రపంచదేశాలకు అండగా ఉండటానికి టెస్టింగ్ కిట్స్ సరఫరా చేస్తూ వస్తోంది. తాజాగా మన దేశంలో కొన్ని రాష్ట్రాలు చైనా దేశానికి సంబంధించిన టెస్టింగ్ కిట్స్ వాడి వాటి రిజల్ట్ చూసి దిమ్మ తిరిగి పోయాయి. మేటర్ లోకి వెళ్తే కరోనా వైరస్ వచ్చిన వ్యాధిగ్రస్తుడు టెస్ట్ చేస్తే నెగిటివ్ అని చూపించగా… వేరే దేశాలకు చెందిన టెస్టింగ్ కిట్ ద్వారా అదే వ్యక్తికి పరీక్ష చేయగా ఇంకా అతనిలో కరోనా వైరస్ ఉందని ఫలితాలు వస్తున్నాయి.

 

దీంతో ముందుగానే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్త పడి మొత్తాన్ని చైనా టెస్టింగ్ కిట్స్ వాడకుండా పక్కన పెట్టడం జరిగింది. దీంతో ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకుని చైనా దేశానికి చెందిన టెస్టింగ్ కిట్స్ కంపెనీలను ప్రశ్నించగా… మాట బుకాయిస్తూ అలా జరగదని సదరు కంపెనీలు అంటున్నాయట. అయితే కరోనా వైరస్ టెస్టింగ్ చేసిన తరువాత వచ్చిన రిజల్ట్ ని, అదే సమయంలో సదరు వ్యక్తి నుండి వేరే టెస్టింగ్ కిట్స్ ద్వారా వచ్చిన రిజల్ట్ మొత్తం సదరు కంపెనీకి పంపిస్తే చైనా కంపెనీలు తప్పు ఒప్పుకుంటూ న్నాయట. దీంతో ఏం చైనా లాజికల్ రా బాబు అన్న పరిస్థితి కేంద్రంలో నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: