నిజాయితీకి నిలువుటద్దంగా చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు  అక్రమాలపై వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దృష్టి పెట్టింది. ముందుగా చంద్రబాబు బినామీలు గా ఉన్నవారి లిస్టు తయారు చేసుకుని వారి అందరి జాతకాలు బయట పెట్టే పనిలో నిమగ్నం అయ్యారు. ఇప్పటికే టిడిపి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అక్రమాలపై జగన్ ప్రభుత్వం లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా దానిని బట్టి చంద్రబాబు పరపతి తగ్గించాలని వైసిపి ప్రయత్నిస్తూనే ఉంది. గత టిడిపి ప్రభుత్వంలో ఆ విధంగానే ఎన్నో అక్రమాలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నేరుగా ఆ వ్యవహారాల్లో దూర్చకపోయినా ఆయన అనుచరులు అనేక అవినీతి వ్యవహారాల్లో కోట్లాది రూపాయల సొమ్ము లు వెనుకేసుకున్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ లెక్కలను తేల్చే పనిలో నిమగ్నమయ్యాడు జగన్. 

 

IHG


చంద్రబాబు కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంపై వైసీపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది.  తాజాగా కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లో భారీ ఎత్తున అవకతవకలు జరిగినట్లు గా బలమైన ఆధారాలు లభించాయి. ముఖ్యంగా చంద్రబాబు తరఫున అక్కడ రాజకీయ వ్యవహారాలు అన్నిటినీ చక్కబెట్టే ఆయన పీఏ మనోహర్ అవినీతి వ్యవహారం లో అడ్డంగా దొరికిపోయినట్టు తెలుస్తోంది. వీటి ఆధారంగా చంద్రబాబును కార్నర్ చేసే విధంగా ప్రయత్నాలు మొదలయ్యాయి. కుప్పం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ స్కాం లో దాదాపు రెండు కోట్ల వరకు అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత బ్యాంక్ చైర్మన్ ఈ అవినీతి వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, వారు కేసు నమోదు చేసుకోవడం జరిగిపోయాయి. ఈ స్కామ్ పై పూర్తి వివరాలు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నాయి. 

 


తాకట్టు బంగారంపై ఆడిటింగ్ జరుగుతున్న సమయంలో 30 బంగారం ప్యాకెట్లు కనిపించకపోవడం కలకలం రేపింది. వాటి విలువ 46.75 లక్షలు. ఆ రుణాలపై వడ్డీ 38.44  లక్షలు. ఈ అవినీతి వ్యవహారంపై లాకర్ ఇంచార్జ్ కమ్ మేనేజర్ నవీన్ బాబు ని ప్రశ్నిస్తే మార్చి 15 లోపు మొత్తం సొమ్ము చెల్లిస్తాను అంటూ చెప్పినట్లు, ఇప్పటి వరకు ఆ సొమ్మును చెల్లించలేనట్టు తెలుస్తోంది. మార్చి 15 మళ్లీ ఇన్స్పెక్షన్ జరపగా 70 4.81 లక్షల సొమ్ములు ఉండాల్సి ఉండగా 27. 97 లక్షలు మాత్రమే ఉన్నట్లు ఆడిటింగ్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై మేనేజర్ నవీన్ బాబు, క్యాషియర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. అయితే అసలు ఇక్కడ అందరికీ తలెత్తుతున్న ప్రశ్న ఏమిటంటే ? అసలు బంగారం మాయం కావడం ఏంటి ? దానికి బదులుగా డబ్బులు కట్టేస్తాను అని సదరు మేనేజర్ చెప్పడం ఏమిటి ? ఈ విషయాలను విశ్లేషిస్తే భారీ కుంభకోణమే జరిగినట్టుగా అర్థమవుతోంది. 

 


ఇక మరో వ్యవహారంలో 20.25 లక్ష లకు సంబంధించిన వ్యవహారం క్లారిటీ లేకుండా ఉందట. దీనిపై మేనేజర్ ప్రశ్నించగా 2015లో శ్రీనివాసులు తీసుకుపోయాడు అని ఆయన మనోహర్ మనిషి అని తిరుపతి గంగమాంబ గుడి కి చెందిన పదహారు బాండ్లను తాకట్టు పెట్టి డబ్బు తీసుకెళ్లినట్లు చెప్పాడట. అసలు ఈ గుడి కి సంబంధించిన బాండ్లను ఎవరో తాకట్టు పెట్టడం.. దానికి బ్యాంకు డబ్బులు ఇవ్వడం ఈ వ్యవహారంలో చంద్రబాబు పీఏ రికమండ్ చేయడం ఇదంతా పెద్ద అవినీతి పుట్టగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు పీఏ మనోహర్ అప్రూవర్ గా మారితే మరిన్ని అవినీతి వ్యవహారాలు బయటపడతాయో చూడాలి. ఏదిఏమైనా కుప్పం లో చంద్రబాబుకు అన్ని రకాలుగా చెక్ పెట్టాలని జగన్ కసిగా ఉన్నట్టు కనిపిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: