పాపం కళ్లు కూడా తెరవని పసిపాప పుట్టగానే తల్లిని కోల్పోయింది.. నిజానికి ఇదంతా కరోనా అనే దుష్ట శక్తి వల్ల కలిగిన బాధ.. ఈ వ్యధ వీరిది ఒక్కరిదే కాదు.. లోకంలో ఎందరో ఇలాంటి ఘోరమైన పరిస్దితులను అనుభవిస్తున్నారు.. కనీసం తొమ్మిది మాసాలు మోసి కన్న బిడ్దలను కూడా చూడకుండానే కన్ను మూస్తున్నారు.. ఈ పాపానికి బాధ్యులు ఎవరని చెబుతాం.. అంతే.. కష్టం అయినా, నష్టం అయినా అనుభవించి తీరవలసిందే.. మరీ బాధించే విషయం ఏంటంటే అమ్మ పొత్తిళ్లలో పడుకోవలసిన పసివారు లోకం తెలియక ముందే అనాధలా మారుతున్నారు.. ఇది ఏ జన్మ శాపమో..

 

 

ఇకపోతే అమెరికాలో హృదయాన్ని ద్రవింప చేసే దారుణ ఘటన జరిగింది.. అదేమంటే గర్భంతో ఉన్న ఓ మహిళా ఖైదీ బిడ్డకు జన్మనిచ్చి మరణించింది. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ కేసులో ఆండ్రియా సర్కిల్ బేర్(30) అనే మహిళ జైలు శిక్షను అనుభవిస్తుంది.. కాగా గర్భవతి అయినా ఈమెను జైలు సిబ్బంది, మార్చి 28 న చెకప్ కోసమని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అన్ని పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. అంతా బాగానే ఉందని చెప్పి అదే రోజు డిశ్చార్జ్ కూడా చేశారు..

 

 

కాగా అధికారులు ఆమెను తిరిగి జైలుకు తరలించారు. అయితే మూడు రోజుల తరువాత ఆ మహిళా ఖైదీకి జ్వరం, పొడి దగ్గుతో పాటుగా, ఇతర లక్షణాలు కనిపించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.. అక్కడ పరీక్షలు నిర్వహించగా ఆమెకు కరోనా సోకినట్టు వైద్యులు నిర్థారించి, వెంటనే ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఇక కడుపులో ఉన్న బిడ్దకు ప్రమాదం సంభవించకూడదనే ఉద్దేశ్యంతో ఆ మరుసటి రోజే సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీసారు..

 

 

అయితే ఆమె పరిస్థితి అప్పటికే క్షీణించడంతో చికిత్స పొందుతూ మరణించింది. ఈ నేపధ్యంలో పుట్టిన బిడ్డ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎటువంటి ప్రకటన చేయలేదు... ఆ పసికందును జాగ్రత్తగా హస్పిటల్లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: