కరోనా కట్టడిలో భారత్ విజయం సాధిస్తోంది. సాంకేతికంగా, అభివృద్ధి పరంగా మనకంటే అత్యున్నంత ఉన్న దేశాల కంటే కూడా ఇండియా కరోనాపై విజయవంతంగా పోరాడుతోంది. దేశంలో మరణాల సంఖ్యను చాలా వరకూ కంట్రోల్ చేస్తోంది. దేశంలో మరణాల రేటు కూడా ప్రపంచ దేశాలతో పోలిస్తే మెరుగ్గానే ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఇండియాకు కరోనా విషయంలో ఇంకో గుడ్ న్యూస్ లభించింది.

 

 

అదేంటంటే.. దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య బాగా తగ్గింది. మంగళవారం 170గా ఉన్న హాట్ స్పాట్ జిల్లాల సంఖ్య బుధవారం నాటికి 129 కి పరిమితమైంది. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఆరెంజ్ జోన్ జిల్లాలు 207 నుంచి 297 కి పెరిగాయి. అయితే గ్రీన్ జోన్ లోని జిల్లాలు 325 నుంచి 307కి తగ్గడం కాస్త అసంతప్తి కలిగిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా లెక్కలు పరిశీలిస్తే.. మొత్తం 28 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాల్లో కరోనా ప్రబలంగా ఉందనే చెప్పాలి.

 

 

9 రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా 15 జిల్లాల్లో కరోనా వైరస్ విజృంభణ తీవ్రంగా ఉంది. మరీ వివరంగా చెప్పాలంటే.. వీటిలో 7 జిల్లాల్లో పరిస్థితులు మరీ భయంకరంగా ఉన్నాయన్నమాట. అలా భయంకరంగా ఉన్న జిల్లాల జాబితాలో తెలంగాణలో హైదరాబాద్, మహారాష్ట్రలోని ముంబయి, పూణె జిల్లాలు, రాజస్థాన్ లోని జైపూర్, మధ్యప్రదేశ్ లో ఇండోర్, గుజరాత్ లోని అహ్మదాబాద్, ఢిల్లీలోని ఢిల్లీ జిల్లాలు ఉన్నాయి.

 

 

ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పిక్చరేంటో బోధపడింది కాబట్టి.. కరోనా అధికంగా ఉన్న ఏడు జిల్లాలపై మరింతగా దృష్టి సారించాలని కేంద్రం భావిస్తోంది. ఈజిల్లాల్లో సక్సస్ అయితే కరోనా కట్టడిలో ఇండియా సక్సస్ అయినట్టే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: