అగ్ర రాజ్యం అధ్యక్షుడు ట్రంప్ కి అన్ని దేశాల అధినేతలతో మంచి స్నేహం, విరోధం రెండూ ఉంటాయి. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే అన్ని దేశాలకంటే కూడా భారత దేశంతో  అందులోనూ ప్రధాని మోడీతో ట్రంప్ కి మాంచి స్నేహం ఉంది. అందుకు రాజకీయ కారణాలు అనేకం ఉండచ్చు కానీ వారిద్దరి మధ్య స్నేహం చూసి కుళ్ళుకున్న దేశాలు కూడా లేకపోలేదు. మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ సతీ సమేతంగా ఇండియా కూడా వచ్చి ఆతిద్యాన్ని స్వీకరించి మరీ వెళ్ళారు. అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో మోడీ స్నేహం ట్రంప్ కి ఎంతో అవసరమైనది కూడా కానీ..

IHG'- Thousands, plus <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DONALD TRUMP' target='_blank' title='trump-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>trump</a>, cheer for PM <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NARENDRA MODI' target='_blank' title='narendra modi-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>narendra modi</a> ...

ఒక్క సారిగా ట్రంప్ తన రూటు మార్చేశాడు.. సోషల్ మీడియా     సాక్షిగా మోడీ తో స్నేహాన్ని తుంచేశారు. ట్రంప్ సోషల్ మీడియా  ఖాతాని నిర్వహిస్తున్న వైట్ హౌస్ మోడీ ఖాతాని అన్ ఫాలో చేసింది. అంతేకాదు రాష్ట్రపతి కోవిండ్ ని సైతం అన్ ఫాలో చేసింది. అమెరికాలో ఉన్న భారత రాయభార కార్యాలయంని కూడా అనుసరించడం మానేసింది. ట్రంప్         అకౌంట్ దాదాపు 19 మంది భారతీయులని ఫాలో అవుతూ ఉండేది కానీ ఇప్పుడు ఆ సంఖ్య 13 కి పడిపోయింది. అయితే ఈ 13 మంది భారతీయులు కూడా అమెరికాలో ఉన్న భారత ఎన్నారైలు అమెరికా పరిపాలనతో సంభంధం ఉన్న వారు కావడం గమనార్హం..అయితే

IHG

కొన్ని వారాల క్రితమే వైట్ హౌస్ ఖాతా మోడీ  సోషల్ మీడియా  ఖాతాని ఫాలో అవడంతో ఇలా రికార్డ్ లకి ఎక్కిన  ప్రపంచ స్థాయి నాయకుడిగా మోడీ గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10 నుంచీ వైట్ హౌస్ మోడీ ఖాతాని ఫాలో అవుతూ వచ్చింది. కానీ ఒక్క సారిగా మోడీ ని అన్ ఫాలో చేయడం చర్చనీయంసం అయ్యింది. ఇలా చేయడం వెనుక కారణాలు స్పష్టంగా తెలియక పోయినా భారత్ , అమెరికా మధ్య ఉన్న స్నేహ భంధం దెబ్బతినిందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పవచ్చు అంటున్నారు విశ్లేషకులు..అయితే మోడీ అకౌంట్ ని అన్ ఫాలో చేయడం అమెరికా మోడీ ని అవమానించినట్టేనని ఇది అమెరికా రాజకీయాలపై ప్రభావం తప్పకుండా చూపుతుందని అంటున్నారు పరిశీలకులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: