మ‌హారాష్ట్ర శాస‌న‌మండ‌లికి సీఎం ఉద్ద‌వ్ థాక్రేను నామినేటెడ్ చేసే విష‌య‌మై ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యాన్ని పెండింగ్‌లో ఉంచుతూ వ‌స్తున్నారు. ఉభయ సభల్లోనూ సభ్యుడు కాని ఉద్దవ్‌.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆరు నెలల్లోగా శాసనమండలి లేదా శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంది. లేని ప‌క్షంలో ఆయ‌న త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి ఉంది. మే 28 వ‌ర‌కు ఆయ‌న‌కు గ‌డువు ఉంది. అయితే  దేశంలో కోవిడ్‌-19తో నెల‌కొన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో శాస‌న‌మండ‌లికి సంబంధించిన ఎన్నిక‌ల‌ను వాయిదా వేసిన విష‌యం తెలిసిందే.


ఈనేప‌థ్యంలో ఉద్ద‌వ్ కొన‌సాగాలంటే గ‌వ‌ర్న‌ర్ కోటా కింద ఆయన నామినేటెడ్ చేసే స‌భ్యుడిగా శాన‌స‌న‌మండ‌లికి వెళ్లాల్సి ఉంది. ఉద్ద‌వ్ థాక్రేను శాస‌న‌మండ‌లికి ఎంపిక చేయాల‌ని కోరుతూ దాదాపు నెల‌న్న‌ర క్రిత‌మే శివ‌సేన‌, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా సంత‌కాల‌తో కూడిన విన‌తిప‌త్రాన్ని గ‌వ‌ర్న‌ర్‌కు అంద‌జేశారు. అయితే చాలారోజులుగా గ‌వ‌ర్న‌ర్ ఏ విష‌యం తేల్చ‌కుండా పెండింగ్‌లో ఉంచుతూ వ‌స్తున్నారు. ఈనేప‌థ్యంలోనే బుధ‌వారం సీఎం ఉద్ద‌వ్‌థాక్రే త‌న‌ను శాసనమండలికి నామినేట్‌ చేస్తూ  రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉండటంతో జోక్యం చేసుకోవాలని ప్రధాని మోదీని కోరిన‌ట్లు స‌మాచారం. 


రాష్ట్రంలో రాజకీయ అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉద్దవ్‌ ఫోన్‌లో ప్రధానికి వివరించారని సమాచారం. రాజ‌కీయా అంశాల‌కు తావిస్తే రాష్ట్రంలో ప‌రిస్థితులు చేజారిపోతుంద‌ని చెప్పిన‌ట్లు తెలిసింది. అడ్మినిస్ట్రేష‌న్‌కు ఏమాత్రం ఇబ్బంది క‌లిగినా ఇది రాష్ట్రంలోని పాల‌న వ్య‌వ‌స్థ‌పై అంతిమంగా క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని వివ‌రించిన‌ట్లు సమాచారం.  అయితే ఉద్ద‌వ్ వ్యాఖ్య‌ల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న ప్ర‌ధానిమోదీ తాను నిపుణుల‌తో మాట్లాడి అవ‌కాశం ఉంటే త‌ప్ప‌క జోక్యం చేసుకుంటామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: