కరోనా పై పోరాటంలో ఏపీ అన్ని చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే ఎక్కువగా పరీక్షలు చేయిస్తున్న రాష్ట్రంగా ఇప్పటికే రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పరీక్షల ల్యాబ్ ల విషయంలోనూ చొరవ చూపిస్తోంది. శ్రీకాకుళం రిమ్స్‌లో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లో ట్రయల్‌ టెస్టులు ప్రారంభం అయ్యాయి. ఒంగోలు,నెల్లూరు లో ల్యాబ్‌ ఏర్పాటునకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటున్నారు.

 

 

శనివారం నాటికి ఈ మూడు కొత్త ల్యాబ్‌లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. గడచిన 24 గంటల్లో 73 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 29 కేసులు నమోదు కాగా.. వీటిలో 27 కేసులు నరసారావుపేట నుంచే వచ్చాయి. అక్కడ పెద్ద ఎత్తున కంటైన్‌ మెంట్‌చర్యలు తీసుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 7,727 పరీక్షలు చేశారు. వీటిలో 70శాతం పరీక్షలు రెడ్‌జోన్లలోనే చేశారు. ఇప్పటివరకూ 88 వేల 061 పరీక్షలు చేశారు. వెరీ యాక్టివ్,యాక్టివ్, డార్మంట్‌ క్లస్టర్లు గుర్తించారు.

 

 

గడచిన 5 రోజుల్లో కేసులు నమోదైన ప్రాంతాలను వెరీ యాక్టివ్‌ క్లస్టర్లుగా పరిగణిస్తున్నారు. ఇలాంటివి రాష్ట్రంలో 76 క్లస్టర్లు ఉన్నాయి. కుటుంబ సర్వేలో గుర్తించిన వారిలో ఇప్పటి వరకూ 12వేల247 పరీక్షలు చేశారు. మిగిలిన వారికి 3రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుని వాటి ద్వారా కూరగాయలను పంపిస్తున్నారు. ప్రత్యేకించి రెడ్‌ జోన్లకు చేరువగా ఇలాంటి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. కరోనా కట్టడికి మరింత పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేయనున్నారు.

 

 

రెడ్ జోన్లలో ఆర్టీసీ బస్సుల ద్వారా కూరగాయలు ఇంటి వద్దకే పంపిణీ చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. టెలి మెడిసిన్ ను మరింత సమర్థంగా నడపాలని దీని పర్యవేక్షణకు జిల్లాలో జాయింట్ కలెక్టర్ ను నియమించాలని సీఎం ఆదేశించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: