కరోనా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంటే.. కొందరు కరోనాతోనే ఆడుకుంటున్నారు.. ఈ వైరస్ మొదలైనప్పట్లో ఉన్న భయం ఇప్పుడు చాలావరకు ప్రజల్లో తగ్గిపోయింది. ఫలితంగా జనం వింత వింత పనులు చేస్తున్నారు.. కొందరైతే ఆన్‌లైన్‌లో పెళ్లీలు కూడా చేసుకుంటున్నారు.. మరి కొందరు లవర్స్‌ను పట్టుకుని చెట్ల వెంట పుట్టల వెంట పోలీసుల కళ్లుగప్పి షికార్లు చేస్తున్నారు.. ఇదిలా ఉండగా ఓ యువకుడైతే ఈ కరోనా టైం ను పక్కాగా వందశాతం వాడుకున్నాడు.. అదెలా అంటే..

 

 

అతని తల్లి ఇంట్లోకి సరకులు తీసుకు రా నాయనా అని చెబితే.. సరకులు తెస్తే ఏం సర్‌ప్రైజ్ ఉంటుందని.. ఒక ఆకు ఎక్కువ చదివి ఏకంగా అమ్మాయినే తెచ్చాడు.. దీంతో కొడుకు చేసిన పనికి చిర్రెత్తుకొచ్చిన అతడి తల్లి.. కొడుకును, అతడితోపాటు వచ్చిన కొత్త కోడలిని ఇంట్లోకి రానీయకుండా, వారిని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఇకపోతే ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. తన కొడుకు ఇంతలా ఊహించని పని చేస్తాడని అనుకోని ఆ తల్లి వేదనతో వాపోతుంది.. ఈ లాక్‌డౌన్ మొదలు పెట్టినప్పటి నుండి తాను గడప దాటి బయటకు రాలేదని.. కానీ కొడుకు చేసిన పనికి పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందని బాధతో తెలిపింది.

 

 

ఇదిలా ఉండగా పెళ్లి చేసుకున్న ఆ నూతన జంట దగ్గర తమ పెళ్లి అయ్యినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవట.. వీళ్ల పెళ్లి చేసిన పంతులేమో లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మ్యారేజ్ సర్టిఫికెట్ ఇస్తానని చెప్పారట.. మరి వీళ్ల పెళ్లి చెల్లుతుందో లేదో చట్టమే నిర్ణయించాలి.. ఇకపోతే కొత్త కోడలుతో పాటుగా.. తల్లి కొడుకులు పోలీస్ స్టేషన్లో ఉన్న ఫోటోను జర్నలిస్ట్ స్మితా ప్రకాశ్ సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అసలే కొతుల వంశం అయిన మన నెటిజన్స్ ఊరుకుంటారా.. ఫన్నీగా స్పందిస్తూ...

 

 

తల్లి ఇంట్లోకి సరుకులు తెమ్మని పంపిస్తే.. కొడుకు వంట మనిషిని తీసుకొచ్చాడని.. ఏ షాపులో పెళ్లి కూతుళ్లను విక్రయిస్తున్నారంటూ మరొకరు.. ఇలాంటి పనులు యూపీ కుర్రాళ్లు మాత్రమే చేయగలరని ఇంకొకరు ఒక ఆట ఆడుకుంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: