ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్  కొనసాగుతున్న వేల జగన్మోహన్ రెడ్డి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకు కొంత ఊరట కలిగించే  విధంగా మార్గదర్శకాలను జారీ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాహనదారులకు జగన్మోహన్ రెడ్డి  సర్కార్ స్వల్ప ఊరట కల్పించింది. మోటార్ వెహికల్ టాక్స్ చెల్లించేందుకు ప్రస్తుతం లాక్ డౌన్  సమయంలో వాహనాల యజమానులు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో... టాక్స్ చెల్లించేందుకు గ్రేస్ పీరియడ్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. ఈ మేరకు ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణ బాబు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. 

 

 

 వాస్తవంగా అయితే ఏప్రిల్ 30వ తేదీతో టాక్స్చెల్లింపుకు  గడువు  పూర్తవుతుంది. కానీ ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఈ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మామూలుగా అయితే వెహికల్ టాక్స్ అడ్వాన్స్ గా  చెల్లిస్తూ ఉంటారు... లేదా ప్రతి త్రైమాసికానికి కూడా వెహికల్ టాక్స్ చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఒకవేళ సకాలంలో వెహికల్ టాక్స్ చెల్లించని ఎడల... భారీ మొత్తంలో జరిమానా విధిస్తారు అధికారులు. 50 శాతం నుంచి రెండు వందల శాతం వరకు వెహికల్ టాక్స్ చెల్లించని వారికి జరిమానా విధిస్తూ ఉంటారు అధికారులు. 

 

 

 ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్  లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రస్తుతం వాహనదారులు త్రైమాసిక టాక్స్  చెల్లించేందుకు తీవ్ర ఇబ్బందులు పడతారు అని భావించిన జగన్మోహన్ రెడ్డి  సర్కార్... వాహనాల టాక్స్ చెల్లింపు గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ముఖ్యంగా లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఇక లాక్ డౌన్  ప్రభావం అన్ని రంగాలపై పడుతున్న విషయం తెలిసిందే. దీంతో అన్ని రంగాలు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాహనదారులను టాక్స్ లు  చెల్లించాలని ఇబ్బంది పెట్టడం సరైనది కాదని భావించి... చెల్లింపు విషయంలో వెసులుబాటు కల్పించాలి అంటూ లారీ ఓనర్స్ అసోసియేషన్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. ఈ విన్నపాన్ని పరిగణలోకి తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి  సర్కార్ టాక్స్ చెల్లింపు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో వాహనదారులకు స్వల్ప ఊరట లభించినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: