ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాలు కర్నూలు, కృష్ణా, గుంటూరు. గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా నరసరావుపేట హడలెత్తిస్తోంది. చిన్న పట్టణమే అయినా కరోనా కేసుల్లో దూసుకుపోతోంది. కేవలం రెండులక్షల జనాభా ఉండే నరసరావుపేటలో ఏకంగా కొత్తగా 26 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఈ ఒక్క పట్టణంలోనే కరోనా రోగుల సంఖ్య 104కు పెరిగింది.

 

 

నరసరావుపేటలో కరోనా ఎలా వచ్చిందో పరిశీలిస్తే.. ఏప్రిల్ 12న ఓ కేబుల్ ఆపరేటర్ కు కరోనా వచ్చింది. ఆ తర్వాత అడపాదడపా ఒకటి, రెండు కేసులు నమోదయ్యాయి. ఓ వారం నుంచి తీవ్రత బాగా పెరిగింది. ఈనెల 20 నాటికి నరసరావుపేటలో ఉన్న కరోనా కేసులు 25 మాత్రమే. కానీ 239 కేసులు, 2510 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇక 2715 కేసులు2817 కేసులు వచ్చాయి. తాజాగా 29న అత్యధికంగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో ఒక్క నరసరావుపేటలోనే మొత్తం 104కరోనా కేసులు ఉన్నాయి.

 

 

అందులోనూ నరసరావుపేటలోని వరవకట్ట ప్రాంతంలో అత్యధికంగా 81 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించిన తర్వాత కూడా పోలీసులు పెద్దగా పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేసులు వంద దాటటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్‌ మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 

 

వైరస్ కట్టడిని నియంత్రించేందుకు నరసరావుపేటలో 2 రోజుల పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు చేశారు. బుధవారం నరసరావుపేట పూర్తిగా లాక్ డౌన్ అయ్యింది. గురు వారం కూడా జనం రోడ్డుపై కనిపించేందుకు వీలు లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎవరైనా బయటకు వస్తే క్వారంటైన్ కు పంపించేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా కట్టడిని నివారించలేకపోతే.. భారీగా ప్రాణనష్టం తప్పదనే ఆందోళన కనిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: