ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అగ్ర‌రాజ్యం అమెరికాలో త‌గ్గిన‌ట్టే త‌గ్గి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. అయితే వైర‌స్ త‌గ్గుతుంద‌ని చెప్ప‌డానికి త‌మ ద‌గ్గ‌ర స‌హేత‌క‌మైన ఆధారాలేమి కన‌బ‌డ‌టం లేద‌ని అమెరికా అధికార వ‌ర్గాలు నిర్వేదం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. . ఆ దేశంలో మహమ్మారి దెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య 60 వేలు దాటింది. రెండు దశాబ్దాలపాటు (1955-75) భీకరంగా సాగిన వియత్నాం యుద్ధంలో 58,200 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోగా.. అంతకంటే ఎక్కువ మంది అమెరికన్లను ప్రస్తుతం కరోనా అతి తక్కువ కాలంలో బలి తీసుకోవడం గమనార్హం. 

 

ఇప్ప‌టి వ‌ర‌కు  అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కార‌ణంగా మృతిచెందిన వారి సంఖ్య 61 వేలు దాటింది. మొత్తం కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య 10.64 లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్త కేసుల్లో సుమారు మూడో వంతు అక్కడే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 లక్షల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 2.28 లక్షల మంది ప్రాణాలు విడిచారు. ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా లెక్క‌లు ప‌రిశీలిస్తే ఈవిధంగా ఉన్నాయి. ఇటలీలో 27,682,  ఫ్రాన్స్‌లో 24,087, బెల్జియంలో 7,501, స్పెయిన్‌లో 24,275, జర్మనీలో 6,467 మంది కరోనాతో మృతిచెందారు.ఈ దేశాల్లో క‌రోనా బారిన ప‌డిన వారి సంఖ్య కూడా లక్షల్లోనే ఉండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. 

 

అమెరికాలో కొవిడ్‌-19 ఉద్ధృతి గరిష్ఠ స్థాయికి చేరుకుంద‌ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. సురక్షితంగా, వేగంగా వ్యాపార కార్యకలాపాలను పునరుద్ధరించడంపై దృష్టి సారించిన‌ట్లు వివ‌రించారు. కరోనా ముప్పును అంచనా వేయడంలో నిపుణులు బోల్తా పడ్డారని ఆయన ఆరోప‌ణ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే ప‌రిస్థితిని గ‌మ‌నించి తాను లాక్‌డౌన్‌ వంటి నిర్ణయాలు తీసుకోవడంతో మరణాల ముప్పు గణనీయంగా త‌గ్గింద‌ని స‌మ‌ర్థించుకోవ‌డం విశేషం.  స్పెయిన్‌లో 236,899, ఇటలీలో 203,591, ఫ్రాన్స్‌లో 166,420, బ్రిటన్ 165, 539, జర్మనీలో 161,539, టర్కీలో 117,589, బెల్జియం 47,859 మంది వైరస్ బారినపడ్డారు.  ఇరాన్‌లో కరోనా బాధితుల సంఖ్య 93వేలు దాటగా.. 5,957 మంది చనిపోయిన‌ట్లు డ‌బ్ల్యూహెచ్‌వో త‌న అధికారిక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఇదిలా ఉండ‌గా భార‌త్‌లో క‌రోనా వేగంగా విస్త‌రిస్తోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: