ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకి ఊహించ‌ని చిత్ర‌మైన సంద‌ర్భం ఇది. ఓ వైపు పెద్ద ఊర‌ట‌...మ‌రోవైపు విమ‌ర్శ‌ల ప‌రంప‌ర‌. గెలుపులో సైతం స‌మ‌స్య‌లు తెచ్చి పెట్టే సంద‌ర్భం ఇది. ఢిల్లీ వేదిక‌గా...సుప్రీంకోర్టు సాక్షిగా గెలుఉప సాధించినా దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టలేని ప‌రిస్థితి. ఇదంతా సెంట్రల్ విస్టా ప్రాజెక్టు పేరుతో పార్లమెంటు, ప్రభుత్వ కా​ర్యాలయాల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తలపెట్టడం... కేంద్రం రెండు వేల కోట్లతో చేపట్టిన ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం..ఆ పిటిష‌న్‌ను కేంద్ర కొట్టివేయ‌డం గురించి. 

 

ప్రస్తుతమున్న పార్లమెంట్ భవనం, రాష్ట్రపతి భవన్, నార్త్, సౌత్ బ్లాక్ భవనాలన్నీ 1931 లో నిర్మించిన‌వి. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ నిర్మించాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. దీంతో 2 వేల కోట్ల రూపాయల కేంద్రం ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం భూ వినియోగ చట్టంలో మార్పు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు ప్రాజెక్ట్ ను ఆపాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇప్పటికే ఒక పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. కరోనా వైరస్‌(కోవిడ్‌-19) వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇది అత్యవసరం కాదు’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే స్పష్టం చేశారు. దీంతో ఈ ప్రాజెక్టుకు లైన్ క్లియర్ అయ్యింది. 

 

అయితే, అస‌లు స‌మ‌స్య ఇప్పుడే ఉంది. ఎందుకంటే...క‌ష్ట‌కాలంలో ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవ‌డం ఒక‌ర‌కంగా మోదీ స‌ర్కారుకు స‌వాలే. ఎందుకంటే, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్‌తో ప్రభుత్వానికి ఆదాయం తగ్గటంతో ఈ ప్రాజెక్ట్ ను నిలిపివేయాలని ఇటీవల ప్రధాని రాసిన లేఖలో సోనియా కోరారు. ప్రాజెక్ట్ పెట్టే ఖర్చును హాస్పిటల్స్ సౌకర్యాలు కల్పించేందుకు వినియోగించాలని సూచించారు. ఈ నేప‌థ్యంలో, ప్ర‌భుత్వం వేల కోట్లు ఖ‌ర్చు చేసి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోతుందా?  లేక ఈ మొత్తాన్ని ఇత‌ర కీల‌క‌మైన మౌలిక స‌దుపాయాల‌కు ఉప‌యోగిస్తుందా? అనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: