దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది రోజురోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. కరోనా గురించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తల వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏపీ పోలీస్ విభాగం రాష్ట్రంలో సోషల్ మీడియా ద్వారా అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ అయింది. కరోనాపై అసత్య ప్రచారాన్ని అడ్డుకునేందుకు వాట్సాప్ నంబర్ ను ప్రారంభించింది. 
 
ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన (9071666666) నంబర్ కు సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారానికి సంబంధించిన ఫిర్యాదులు వేల సంఖ్యలో వస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వాట్సాప్ నంబర్ కు 11,474 ఫిర్యాదులు అందాయి. ప్రజల్లో కరోనాపై అసత్య ప్రచారం చేస్తున్న వారి గురించి ఊహించని స్థాయిలో ఫిర్యాదులు రావడంతో సీఐడీ ఇందుకోసం ప్రత్యేక సెల్ ను ఏర్పాటు చేసింది. 
 
ఈరోజు ఏపీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక మీడియాతో మాట్లాడారు. ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. . స్టే సేఫ్, స్టే స్మార్ట్ అనే నినాదంతో 4 వాట్సాప్ నంబర్లను ప్రారంభించామని అన్నారు. ఎవరైనా మహిళలపై అసభ్యకరమైన కామెంట్లు చేస్తే సుమోటోగా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని తెలిపారు. 
 
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అసత్య వార్తలపై స్పష్టత ఇస్తామని అన్నారు. సీఐడీ దగ్గర అసత్య ప్రచారాలు చేసేవారికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ అంతా ఉంటుందని చెప్పారు. నిబంధలను ఉల్లంఘించి ప్రవర్తిస్తే తోక కత్తరిస్తామని హెచ్చరించారు. మొబైల్ యాప్, డాష్ బోర్డులను త్వరలో ఏర్పాటు చేస్తామని అన్నారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఏవి నమ్మాలో ఏవి నమ్మకూడదో ప్రజలకు అర్థం కావడం లేదు.             

మరింత సమాచారం తెలుసుకోండి: