క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో అమెరికాలో ఓ వైపు మ‌ర‌ణ మృందంగం మోగుతున్నా..మ‌రోవైపు లాక్‌డౌన్‌ను క్ర‌మంగా ఎత్తివేసేందుకే ఆ దేశం మొగ్గు చూపుతుండ‌టం ప్ర‌పంచ దేశాల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. అమెరికాలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టకపోయినా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆంక్షల సడలింపుపైనే ఎక్కువ‌గా దృష్టి సారిస్తున్నారు. వచ్చేవారం నుంచి దేశీయ ప్రయాణాలకు అనుమ‌తులిస్తున్న‌ట్లు గురువారం విలేఖ‌రుల స‌మావేశంలో తెలిపారు. లాక్‌డౌన్‌తో నష్టపోయిన ఆర్థిక రంగం త్వరలోనే గాడినపడుతుందని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే వారం నుంచి దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు.

 

కొవిడ్‌ మహమ్మారి దానంతట అదే పోతుందని, వైర‌స్ ప్ర‌భావం చూపే సామ‌ర్థ్యం స‌న్న‌గిల్లుతున్న‌ట్లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయ‌ని పేర్కొన్నారు.  అయితే క‌రోనా వైర‌స్ విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లే అంద‌రిని ర‌క్షిస్తాయ‌ని అన్నారు. వ్యాక్సిన్ల‌పై  ఆధారపడట్లేదని కూడా స్ప‌ష్టం చేశారు. అమెరికా ఎలాంటి పరిస్థితుల‌నైనా  ఎదుర్కోడానికి సిద్ధంగా ఉంద‌ని తెలిపారు. వ్యాక్సిన్‌ ఉన్నా లేకున్నా ఆర్థిక పరిస్థితిని చ‌క్క‌దిద్దుకోవ‌డ‌మే త‌మ ముందున్న ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గడిచిన 24 గంటల్లో అమెరికాలో కరోనా వైరస్‌ మృతుల సంఖ్య 2,502గా నమోదైంది. 

 

అంతకుముందు రెండు రోజులతో పోలిస్తే బుధవారం మృతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో అమెరికాలో మొత్తం మృతుల సంఖ్య 61,361కి పెరిగింది. ట్రంప్ ఎప్ప‌టిలాగే విలేఖ‌రులు విస్తుపోయే వ్యాఖ్య‌లు కొన్ని మ‌ళ్లీ చేశారు. క‌రోనాతో అటు ప్రాణ‌న‌ష్టం..ఇటు ఆర్థికంగా ప‌త‌న‌మ‌వుతున్న వేళ త‌న ఎన్నికల ప్ర‌చార వ్యూహాన్ని ప్ర‌స్తావించ‌డంతో విలేఖ‌రులు సైతం విస్తుపోయారు. తర్వలోనే భారీ ర్యాలీలు నిర్వహించేందుకు సైతం సిద్ధపడుతున్నట్లు తెలిపారు. వచ్చేవారం తాను అరిజోనా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. రోనా వైరస్‌ విజృంభించాక ట్రంప్‌ వాషింగ్టన్‌ వదిలి బయటకు వెళ్లడం ఇదే తొలిసారి కానుంది. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: